అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో మూడు బంగారు పతకాలు సాధించిన రాచకొండ పోలీస్
- June 20, 2024
హైదరాబాద్: రాచకొండ పరిధిలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో విధులు నిర్వహిస్తూ పాన్ ఇండియా నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో మూడు బంగారు పతకాలు సాధించిన హెడ్ కానిస్టేబుల్ అంబోజు అనిల్ కుమార్ ను రాచకొండ కమీషనర్ తరుణ్ జోషి నేరెడ్ మెట్ లోని రాచకొండ కమిషనర్ కార్యాలయంలో అభినందించారు. వీటితో పాటు ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి 25 తేదీలలో థాయ్ లాండ్ దేశములో జరిగిన 28వ ఏషియన్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్-2024 (AMA) లో 45 సంవత్సరముల విభాములో నాలుగు పతకాలు (1 బంగారు పతకం, 3 కాంస్య పతకాలు) అనిల్ కుమార్ సాధించడం జరిగింది. అందులో 4×400 మీటర్ల రిలేలో ఒక బంగారు పతకం మరియు 800 మీటర్లు, 1500 మీటర్లు, 5000 మీటర్ల పరుగుపందెంలో కాంస్య పతకాలు సాధించడం జరిగింది.త్వరలో సెప్టెంబరులో ఆస్ట్రేలియాలో జరుగనున్న అంతర్జాతీయ పోటీలలో పాల్గొంటున్న సందర్భంగా పోలీసు శాఖ తరపున అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని కమీషనర్ ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సిహెచ్ శ్రీకాంత్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్‌లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్‌లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









