టీమ్ఇండియా హోమ్ సీజన్ షెడ్యూల్...
- June 20, 2024
టీమ్ ఇండియా హోమ్ సీజన్ షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. 2024-25లో భారత క్రికెట్ జట్టు 3 జట్లతో మొత్తం 5 సిరీస్‌లు ఆడనుంది. ఇందులో రెండు టెస్టు సిరీస్‌లు, రెండు టీ20 సిరీస్‌లు, ఒక వన్డే సిరీస్ ఉన్నాయి. ఈ క్రమంలో.. బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి.
భారతదేశం హోమ్ షెడ్యూల్ 2024 సెప్టెంబర్ నుండి ప్రారంభం కానుండగా… బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌తో ఈ హోం సీజన్ ప్రారంభం కానుండగా వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్‌తో ముగియనుంది.
2024-25 హోం సీజన్ షెడ్యూల్ వివరాలు..
బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్ ల టెస్టు, మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్‌లు..
టెస్టు సిరీస్..
మొదటి టెస్ట్–సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు–చెన్నై వేదికగా
రెండో టెస్ట్–సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు–కాన్పూర్
టీ20 సిరీస్..
మొదటి టీ20–అక్టోబర్ 6న–ధర్మశాల
రెండో టీ20–అక్టోబర్ 9న–ఢిల్లీ
మూడో టీ20–అక్టోబర్ 12న–హైదరాబాద్
న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్..
మొదటి టెస్ట్–అక్టోబర్ 16 నుంచి 20 వరకు–బెంగళూరు
రెండో టెస్ట్–అక్టోబర్ 24 నుంచి 28 వరకు–పూణే
మూడో టెస్ట్–నవంబర్ 1 నుంచి 5 వరకు–ముంబై
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్ ల టీ20, మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్‌లు..
టీ20 సిరీస్..
మొదటి టీ20–2025 జనవరి 22న–చెన్నై
రెండో టీ20–జనవరి 25న–కోల్‌కతా
మూడో టీ20–జనవరి 28న–రాజ్‌కోట్
నాలుగో టీ20–జనవరి 31న–పూణే
ఐదో టీ20–ఫిబ్రవరి 2న–ముంబై
వన్డేలు..
తొలి వన్డే–ఫిబ్రవరి 6న–నాగ్‌పూర్
రెండో వన్డే–ఫిబ్రవరి 9న–కటక్
మూడో వన్డే–ఫిబ్రవరి 12న–అహ్మదాబాద్
తాజా వార్తలు
- ‘ఏక రాగం దశ సినీ గీతాలు’ సంపుటి ఆవిష్కరించిన ఎస్.పి.శైలజ
- భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
- ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం
- ‘వందే మాతరం’పై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…
- ఏపీ ఫైనాన్షియల్ రికవరీ ప్లాన్
- ఇన్స్టాగ్రామ్ కొత్త డబ్బింగ్ టూల్
- రెండేళ్ల తర్వాత బెత్లెహేంలో వెలిగిన క్రిస్మస్ ట్రీ
- ఫిడే సర్క్యూట్ 2025 టోర్నీలో విజేతగా ప్రజ్ఞానంద
- గ్లోబల్ సమిట్ 2025 ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభిం చారు
- తిరుపతి విద్యార్థిని పై దాడి: హోంమంత్రి కఠిన స్పందన







