తెలుగులో విపరీతమైన క్రేజ్‌తో దూసుకెళ్తోన్న ‘ప్రేమలు’ బ్యూటీ.!
- June 21, 2024
మలయాళ సినిమా ‘ప్రేమలు’ ఇటీవల సెన్సేషనల్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ మంచి వసూళ్లు రాబట్టింది. ఓటీటీలోనూ ఈ సినిమాకి బ్రహ్మరధం పట్టారు.
అన్నింటికీ మించి ఈ సినిమా హీరోయిన్ పేరయితే టాలీవుడ్ జనాల నోళ్లలో తెగ నానింది. దాంతో, సింగిల్ నైట్ స్టార్ అయిపోయిందీ అమ్మడు. ఇంతకీ పేరు చెప్పేలేదుగా మమితా బైజు.
ఈ సినిమాలో అమ్మడి క్యూట్ అప్పియరెన్స్, యాక్టింగ్ టాలెంట్‌కి కుర్రకారు ఫిదా అయ్యింది. దాంతో, తెలుగు మేకర్ల దృష్టిని కూడా బాగా ఆకర్షించింది మమితా బైజు.
ఇప్పటికే తెలుగులో రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్టులు పట్టేసిందన్న ప్రచారం వుంది. అలాగే, అమ్మడి పర్సనాలిటీ, ఫిజిక్, ఆటిట్యూడ్ కొన్ని ప్రత్యేకమైన వాణిజ్య ప్రకటనలకు కరెక్ట్‌గా సూటయ్యేలా వుండడంతో కొన్ని ప్రముఖ కమర్షియల్ కంపెనీలు మమితను సంప్రదిస్తున్నారట.
అందుకోసం భారీ మొత్తంలో రెమ్యునరేషన్ కూడా కట్టబెతున్నారట ఈ మలయాళ ముద్దుగుమ్మకి.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







