ఎన్టీయార్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటంటే.!

- June 21, 2024 , by Maagulf
ఎన్టీయార్ - ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఏంటంటే.!

‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఎన్టీయార్ ఓ సినిమా చేయాల్సి వుంది. ‘కేజీఎఫ్’ తర్వాత ‘సలార్’ సినిమాతో ప్రశాంత్ నీల్ బిజీగా వుండడం ఇంతవరకూ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు.

ప్రస్తుతం ఎన్టీయార్.. ఓ వైపు ‘దేవర’ సినిమాతోనూ, మరోవైపు బాలీవుడ్ సినిమా ‘వార్ 2’తోనూ బిజీగా వున్నాడు.

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ లైన్‌లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్టీయార్ తనకు అత్యంత సన్నిహితులైన కొందరు టెక్నీషియన్లతో స్క్రిప్ట్ చర్చలు జరిపిస్తున్నారనీ తెలుస్తోంది.

అన్నట్లు ఈ సినిమాకి ఓ పవర్ ఫుల్ టైటిల్ కూడా ప్రచారంలోకి వచ్చింది. అదే ‘డ్రాగన్’. అయితే, ఈ టైటిల్‌పై ఇంకా క్లారిటీ లేదు కానీ, ప్రచారంలో వున్న ఈ టైటిల్ పట్ల మంచి రెస్పాన్సే వస్తోంది.

మరో ముఖ్య విషయం ఏంటంటే, ఈ సినిమాలో ఎన్టీయార్‌ని ఓ సరికొత్త గెటప్‌లో డిఫరెంట్ ఆటిట్యూడ్‌తో చూపించబోతున్నాడట ప్రశాంత్ నీల్. కాస్త నెగిటివ్ షేడ్స్ వున్న హీరో పాత్రనీ గుసగుసలు వినిపిస్తున్నాయ్. ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కకుండానే ఇన్ని ఆషక్తికరమైన గాసిప్స్ బయటికొచ్చేశాయంటే.. నిప్పు లేకుండా పొగరాదు కదా.! చూడాలి మరి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com