షేక్ జాయెద్ రోడ్డులో ఢీకొన్న పలు వాహనాలు..భారీగా ట్రాఫిక్ జామ్
- June 22, 2024
దుబాయ్: షేక్ జాయెద్ రోడ్‌లో పలు వాహనాలతో కూడిన ప్రమాదం జరిగిందని దుబాయ్ పోలీసులు శుక్రవారం తెలిపారు. అబుదాబి వైపు వెళ్లే లాస్ట్ ఎగ్జిట్‌కు ముందు పలు వాహనాలు ఢీకొన్న ప్రమాదం కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని అధికార వర్గాలు తెలిపాయి. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) ఇటీవల 2023కి సంబంధించిన రోడ్డు భద్రత గణాంకాలపై 'ఓపెన్ డేటా'ను అప్‌లోడ్ చేసింది. ఏ రోడ్లు మరియు వీధుల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయో గుర్తించింది. దుబాయ్‌లోని షేక్ జాయెద్ రోడ్ లో జరిగిన ప్రమాదాల్లో 16 మరణాలు, 131 మంది గాయాలతో మొత్తం 147 మందితో మూడవ స్థానంలో నిలిచింది.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!