హైదరాబాద్-విజయవాడ హైవే పై ట్రాఫిక్ కష్టాలు తీరబోతున్నాయి
- June 22, 2024
హైదరాబాద్: హైదరాబాద్- విజయవాడ హైవేపై నిత్యం ట్రాఫిక్ కష్టాలు ప్రయాణికులను , వాహనదారులను ఇబ్బందికి గురి చేస్తుంటాయి. అయితే ఇప్పుడు ఆ ఇబ్బందులకు చెక్ పడబోతున్నట్లు తెలుస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో భారీ ఫ్లైఓవర్ నిర్మాణం జరగబోతుంది. తహశీల్దారు ఆఫీసు నుంచి పద్మావతి ఫంక్షన్ హాల్ వరకు 2 కి.మీ. పొడవున నిర్మించనున్నారు.
ఈ ఫ్లైఓవర్‌కు మొత్తం రూ.82 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. వంతెన నిర్మించే ప్రదేశం గట్టిదనం పరంగా అనుకూలంగా ఉందని నిర్ధారణ కావడంతో పనులు మరింత వేగంగా జరిగేందుకు చాన్స్ ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ ఫ్లైఓవర్‌కు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ త్వరలో శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. ఫ్లైఓవర్ నిర్మాణ కాంట్రాక్ట్‌ను దక్కించుకున్న హర్యానాకు చెందిన రాంకుమార్ కన్‌స్ట్రక్షన్స్..నిర్మాణ పనులను రెండు వారాల్లో ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







