24 వసంతాలు పూర్తి చేసుకున్న బసవతారకం హాస్పిటల్..
- June 22, 2024
హైదరాబాద్: ఆంధ్రాలో బసవతారకం హాస్పిటల్ ప్రారంభిస్తామని నందమూరి బాలకృష్ణ తెలిపారు.బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ 24వ వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు అలాగే డా.నోరి దత్తాత్రేయుడు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బసవతారకం హాస్పిటల్ ఎంతో మంది పేదలకు సేవలందిస్తోందని ఆయన తెలిపారు. నిస్వార్థంగా పేదలకు సేవలందించేందుకే ఈ హాస్పిటల్ నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ సంస్థకు అనుమతులపై తన దృష్టికి రాగానే కేబినెట్లో చర్చించి పరిష్కరించామని ఆయన వెల్లడించారు.హాస్పిటల్ ఛైర్మెన్ బాలకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అందరికి ఆదర్శమన్నారు.ఆంధ్ర రాష్ట్రం ఎమ్మెల్యేగా హిందూపురం ప్రభుత్వ హాస్పిటల్ని తీర్చి దిద్ది కార్పోరేట్ తరహా వైద్యం అందిస్తున్నామని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీనికి గతంలోనే చంద్రబాబు స్థలం కేటాయించారని గుర్తు చేశారు.


తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







