'యోగా పతకాలు' పారామిలటరీ బలగాలకు..

- June 12, 2016 , by Maagulf
'యోగా పతకాలు' పారామిలటరీ బలగాలకు..

ఈనెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని పారామిలటరీ బలగాలకు యోగా పతకాలు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక యోగాసనాలు చేసి అసాధారణమైన నైపుణ్యాలను ప్రదర్శించిన వారికి ఈ పతకాలను అందజేయనున్నారు. సీఆర్‌పీఎఫ్‌ నుంచి పదవీ విరమణ పొందిన సిబ్బందిని మాస్టర్‌ యోగా శిక్షకులుగా నియమించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరందరూ సీఆర్‌పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, బీఎస్‌ఎఫ్‌ దళాల్లోని తొమ్మిది లక్షల మందికి యోగా శిక్షణ ఇవ్వనున్నారు.కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో ఇటీవల జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.దాదాపు 30వేల మంది యోగా దినోత్సవం రోజున పలు రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాల్లో యోగా నిర్వహించనున్నారు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఈ ఏడాది రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరపనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరుకానున్నారు. 2వేల మంది భారత్‌-టిబెట్‌ సరిహద్దు పోలీసు సిబ్బంది ఈ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు.యోగాసనాలతో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన వారికి యోగా పతకాలు ఇవ్వనున్నారు. సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ నుంచి కొంత మంది సిబ్బందిని ఎన్నుకొని వాళ్లు అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఇచ్చే ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని పతకాలు అందజేస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com