ముగ్గురు దుర్మార్గులు ఓ యువతిపై అత్యాచారo..
- June 12, 2016
ముగ్గురు దుర్మార్గులు ఓ యువతిని ఎత్తుకెళ్లి ఆమెపై దారుణంగా అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన దేశరాజధాని దిల్లీలో కలకలం రేపింది. నిజాముద్దీన్ ప్రాంతంలో 23ఏళ్ల యువతి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నించినా లాభం లేకపోయింది. దుండగులు కదులుతున్న కారులో యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం యువతిని దిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు సమీపంలోని ఓ ఫ్లైఓవర్ వద్ద పడేసి వెళ్లిపోయారు.
బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.నిందితులపై కిడ్నాప్, అత్యాచారం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







