నీట్ పరీక్షల వివాదం.. ఆందోళనలో యూఏఈ స్టూడెంట్స్..!
- June 24, 2024
యూఏఈ: అనేక మంది భారతీయ విద్యార్థుల మాదిరిగానే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-UG) పరీక్షపై ఆందోళనగా ఉన్నట్లు యూఏఈలో పలువురు విద్యార్థులు తెలిపారు. నీట్ ఎంట్రన్స్ అనేంది భారతదేశంలోని అతిపెద్ద ప్రవేశ పరీక్ష. ఇండియాలో మెడిసిన్ చదవాలనుకునే విద్యార్థులకు ఇందులో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. అయితే, ఇటీవల వెలువడిన ఫలితాల్లో 67 మంది విద్యార్థులు ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) సాధించారు. వారిలో ఆరుగురు ఒకే కోచింగ్ సెంటర్కు చెందినవారు కాగా, పరీక్ష ప్రారంభం ఆలస్యం కావడంతో 1,500 మంది విద్యార్థులకు గ్రేస్ మార్కులు లభించాయి. గత సంవత్సరం కేవలం ఇద్దరు విద్యార్థులకు మాత్రమే AIR 1 వచ్చింది. విద్యార్థి సంఘాల నిరసనలు ఇండియాను కుదిపేస్తోంది. పలు రాస్ట్రాల్లో పేపర్ లీక్ అయినట్లు కేసులు నమోదు అవుతున్నాయి. "ఇది మాకు చాలా బాధాకరమైన సమయం." శంకరాసన్ అన్నారు. మరోవైపు జూన్ 23వ తేదీన (ఆదివారం) పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు మెడికల్ ప్రవేశ పరీక్ష NEET-PG వాయిదా పడింది. ఇదిలా ఉండగా గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులకు ఆరు నగరాల్లో పునఃపరీక్ష జరిగింది. అందులో సగం మందే హాజరు కావడం చర్చనీయాంశమవుతోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







