న్యూ యార్క్ లో కూటమి విజయోత్సవ వేడుకలు

- June 25, 2024 , by Maagulf
న్యూ యార్క్ లో కూటమి విజయోత్సవ వేడుకలు

అమెరికా: అమెరికా న్యూ యార్క్ లో తెలుగు తమ్ముళ్లు మరియు NDA సానుభూతి పరులు కలసి ఆంధ్రప్రదేశ్ ప్రజావిజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన మరియు బిజెపి కూటమి సునామి  సృష్టంచిన సంగతి అందరికి తెలిసిన సంగతే.

ఈ సందర్బంగా జూన్ 23 న న్యూ యార్క్ లోని  జేరికో పట్నంలో వేడుకలు వెంకటేశ్వరావు వోలేటి, ప్రసాద్  కోయి, అశోక్ అట్టాడ మరియు దిలీప్ ముసునూరి కలసి పెద్దల సహకారంతో ఘనంగా నిర్వర్తించారు.

ఈవేడుకలో వక్తలు డా.తిరుమలరావు తిపిర్నేని, కోటేశ్వరావు బొడ్డు, అంజు కొండబోలు, డా.జగ్గారావు అల్లూరి, డా.పూర్ణచంద్రరావు అట్లూరి, డా.కృష్ణరెడ్డి  గుజవర్తి , మాజీ తానా ప్రెసిడెంట్ జయ్ తాళ్ళూరి, సత్య చల్లపల్లి, ఉదయ్ దొమ్మరాజు, సుమంత్ రామిశెట్టి  మరియు ఆర్గనైజర్లు వెంకటేశ్వరావు వోలేటి, ప్రసాద్ కోయి, అశోక్ అట్టాడ మరియు దిలీప్ ముసునూరి  మాట్లడుతూ ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వం మీద ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, ఆశలను, బాధ్యతను గుర్తు చేస్తు  ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు అన్ని పనులు చేయగలరన్న ఆశాభావం వ్యక్తం చేసారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com