యూరోపియన్ మహిళ హత్య కేసు.. కిల్లర్‌కు జీవిత ఖైదు

- June 25, 2024 , by Maagulf
యూరోపియన్ మహిళ హత్య కేసు.. కిల్లర్‌కు జీవిత ఖైదు

మనామా: యూరోపియన్ మహిళను చంపి, ఆమె శరీరాన్ని కాల్చి బూడిద చేసిన బహ్రెయిన్ వ్యక్తికి న్యాయమూర్తి బాదర్ అబ్దుల్తీఫ్ మహ్మద్ అల్ అబ్దుల్లా అధ్యక్షత వహించిన హై క్రిమినల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్ అంతకుముందు అతనికి ఉరిశిక్ష విధించాలని హై క్రిమినల్ కోర్టులోని న్యాయమూర్తులను కోరింది. కేసు వివరాల ప్రకారం.. బాధితురాలు వ్యభిచార వ్యాపారంలో ఉన్నారు. ఆమెతో లైంగిక కార్యకలాపాల కోసం తన ఇంటికి పిలిపించుకున్నాడు. అనంతరం ఆమె తన ఇంటి నుండి బయటకు వెళ్లడాన్ని ఇరుగుపొరుగు వారు చూస్తారనే ఆందోళనతో అతను ఆమెను వెళ్లకుండా అడ్డుకున్నాడు. ఆమె వెళ్లిపోవాలని పట్టుబట్టడంతో.. ఈ క్రమంల  ఆమె గొంతు కోసి చంపాడు. ఆమె మృతదేహాన్ని ఒక మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చివేశాడు. అయితే, ఆ మహిళ అంతకుమందే 999కి డిస్ట్రెస్ కాల్ చేసింది. సహాయం కోరింది. తాను సీ్త్ర సమీపంలోని ఇంట్లో ఉన్నానని తెలిపింది. ఆమెను చంపాలనే ఉద్దేశం తనకు లేదని, మద్యం, డ్రగ్స్‌ మత్తులో చేసినట్లు నిందితుడు విచారణలో తెలిపాడు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కిల్లర్‌కు జీవిత ఖైదు విధించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com