మంగాఫ్ ఫైర్ : 49వ బాధితుడు బీహార్ వాసిగా గుర్తింపు

- June 25, 2024 , by Maagulf
మంగాఫ్ ఫైర్ : 49వ బాధితుడు బీహార్ వాసిగా గుర్తింపు

కువైట్: ఎన్‌బిటిసి క్యాంప్ ఫైర్‌లో 49వ బాధితుడు డిఎన్‌ఎ పరీక్ష నిర్వహించిన తర్వాత బీహార్‌లోని దర్బంగాకు చెందిన కలుకా (32)గా అధికారికంగా గుర్తించారు. కువైట్ అధికారుల సూచన మేరకు డీఎన్‌ఏ పరీక్ష ప్రక్రియల కోసం కలుకా సోదరుడు షారుక్ ఖాన్ ని NBTC యాజమాన్యం కువైట్‌కు రప్పించింది. గత ఏడేళ్లుగా NBTCలో ఉద్యోగి అయిన కలుకా ప్రస్తుతం NBTC హైవే సెంటర్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేసేవారు. ఆయన పార్థివ దేహాన్ని సోమవారం రాత్రి 8.15 గంటలకు ఎయిర్ ఇండియా విమానంలో ముంబై మీదుగా పాట్నాకు పంపినట్లు NBTC HR & అడ్మిన్ కార్పొరేట్ జనరల్ మేనేజర్ మనోజ్ నంథియాలత్ తెలిపారు.   

మంగాఫ్ అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరి కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయంగా రూ.8 లక్షలు అందజేసారు. అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.25వేలు కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంతో పంచుకున్నట్లు NBTC యాజమాన్యం తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రిలో 6 మంది ఉద్యోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 3 మంది ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com