శ్రీ విష్ణు కెరీర్‌లోనే రికార్డు స్థాయి బిజినెస్.!

- June 25, 2024 , by Maagulf
శ్రీ విష్ణు కెరీర్‌లోనే రికార్డు స్థాయి బిజినెస్.!

విలక్షణ నటుడు శ్రీ విష్ణు ఇటీవల ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో హిట్టు కొట్టాడు. అదే హుషారుతో రెండు సినిమాల్ని లైన్‌లో పెట్టేశాడు కూడా. అందులో ఆ రెండు సినిమాలకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్ కూడా ఆ మధ్య రివీల్ చేశాడు శ్రీ విష్ణు.

అందులో ఒకటి ‘స్వాగ్’. ‘శ్వాగణిక లోకంలోకి స్వాగతం’ అంటూ ఓ డిఫరెంట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు ఈ సినిమాకి సంబంధించి. కార్జూన్ బొమ్మలతో ఓ కథ చెప్పించి ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు.

ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ బిజినెస్ అనూహ్యంగా జరిగినట్లు తాజా సమాచారం. ఇంతవరకూ శ్రీ విష్ణు కెరీర్‌లో ఏ సినిమాకీ ఈ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరగలేదట.

ఇకపోతే, ఈ సినిమాని గతంలో శ్రీ విష్ణుతో ‘రాజ రాజ చోర’ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టిన హస్మిత్ గోళి తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్స్ మీడియా ఫాక్టరీలో టి.జి.విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా దక్షా నగార్కర్, శరణ్య ప్రదీప్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అలాగే సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ఓ సర్‌ప్రైజింగ్ రోల్‌లో కనిపించనుంది ఈ సినిమాలో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com