తెలంగాణ: సమ్మె విరమించిన జూడాలు
- June 26, 2024
హైదరాబాద్: వారం రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలిపిన జూడాలు.. సోమవారం నుంచి ఓపీ, ఎలక్టివ్ సర్జరీలను సైతం బహిష్కరించి సమ్మెబాట పట్టారు. వైద్యారోగ్య శాఖ మంత్రితో జరిపిన చర్చలు అసంపూర్ణం కాగా.. డీఎంఈతో చేసిన చర్చలు సైతం విఫలం కావటంతో సమ్మె ఉద్ధృతం చేశారు.అయితే మంగళవారం రాత్రి మరోసారి డీఎంఈ, ఆరోగ్యశాఖ అధికారులతో అర్ధరాత్రి వరకు జూడాల చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో పలు హామీల అమలుకు ప్రభుత్వం వాగ్దానం చేయడంతో సమ్మె తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు జూడాలు ప్రకటించారు.
ప్రభుత్వ హామీ నేతపథ్యంలో సమ్మెను తాత్కాలికంగా నిపివేస్తున్నట్లు జూడాలు తెలిపారు. జీవోలు విడుదల కాకపోతే రేపు తిరిగి సమ్మె ప్రారంభిస్తామని హెచ్చరించారు. మరోవైపు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేడు జిల్లాల్లోని జూడాలతో చర్చలు జరపనున్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతినెలా స్టైపెండ్ చెల్లింపు సహా ఎనిమిది ప్రధాన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ జూనియర్ డాక్టర్లు ఇటీవల సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







