అయ్యో పాపం.! కాజల్‌కి అన్యాయం జరిగిందే.!
- June 26, 2024
‘ఇండియన్ 2’ సినిమాలో కాజల్ హీరోయిన్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో తనకు ఛాన్స్ రావడం ఎంత అదృష్టంగా భావిస్తున్నా.. అని గతంలోనే కాజల్ చెప్పుకొచ్చింది.
అయితే, రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘ఇండియన్ 2’ ట్రైలర్‌లో సినిమాకి సంబంధించిన ప్రధాన తారాగణం కమల్ హాసన్‌తో పాటూ, కీలక తారాగనం అయిన సిద్దార్ధ్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్.జె.సూర్య.. ఇలా పలువురు నటీ నటులు కనిపించారు.
కానీ, భూతద్ధం వేసి వెతికినా ఎక్కడా కాజల్ కనిపించినట్లు లేదు. దాదాపు రెండు నిమిషాల 50 సెకన్ల పాటు కట్ చేసిన ట్రైలర్‌లో ఎక్కడా కాజల్ అగర్వాల్‌కి కనీసం చోటు దక్కకపోవడంతో ఆమె అభిమానులు నిరాశ చెందుతున్నారు.
అసలు కాజల్ అగర్వాల్ సినిమాలో వుందా.? లేదా.? అన్న అనుమానాలు కలుగుతున్నాయ్. ‘ఇండియన్’ మొదటి పార్ట్‌లో హీరోయిన్ అయిన మనీషా కోయిరాల కూడా ఈ సినిమాలో క్యామియో రోల్ పోషించనుందన్న టాక్ వుంది.
అలాంటిది హీరోయిన్ అని ప్రచారం జరిగిన కాజల్ అగర్వాల్‌కి ట్రైలర్‌లో కనీసం అర సెకను స్పేస్ కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యకరం. కాజల్ అగర్వాల్ కూడా ఇదే ఫీలవుతోందట. ఆమె అభిమానులు మాత్రం చాలా డిజప్పాయింట్ అవుతున్నారు. అయితే, ట్రైలర్ మాత్రం అదుర్సో అదుర్స్.!
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్‌లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









