2023లో 11,988 మంది డ్రగ్స్ ట్రాఫికర్లు అరెస్ట్
- June 27, 2024
యూఏఈ: అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తన 2023 గణాంకాలను విడుదల చేసింది. మొత్తం 8,300 కేసుల్లో 11,988 మంది డ్రగ్స్ ట్రాఫికర్లను అరెస్టు చేశారు. 29,758.743 కిలోగ్రాముల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ను ప్రచారం చేస్తున్న 2,397 వెబ్సైట్లు బ్లాక్ చేసారు. ఈ విషయాన్ని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఫెడరల్ నార్కోటిక్స్ కంట్రోల్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ సయీద్ అబ్దుల్లా అల్ సువైదీ వెల్లడించారు. ప్రపంచంలోని వివిధ దేశాలలోని కౌంటర్పార్ట్ ఏజెన్సీలతో విశిష్టమైన ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సహకారం ద్వారా డ్రగ్స్ అక్రమ రవాణాను నియంత్రించడంలో మంత్రిత్వ శాఖ నిరంతర విజయాన్ని సాధిస్తూ, డ్రగ్స్‌పై తన పోరాటంలో మంత్రిత్వ శాఖ అవిశ్రాంతంగా పోరాటం చేస్తుందని చెప్పారు. అదే సమయంలో యూఏఈ అందించిన సమాచారంతో విదేశాల్లో మొత్తం 4,481 కిలోగ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం జూన్ 26న డ్రగ్ దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవంలో పాల్గొంటుంది.
తాజా వార్తలు
- కింగ్ అబ్దులాజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయం కొత్త రికార్డు..!!
- 30వేలకు పైగా ట్రాఫిక్ లేన్ చట్ట ఉల్లంఘనలు నమోదు..!!
- మెడికల్ సిటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల దినోత్సవం..!!
- దోహాలో మూడు రోజులపాటు సముద్రయానం నిలిపివేత..!!
- అల్-అబ్దాలీలో డీజిల్ అక్రమ రవాణా పై ఉక్కుపాదం..!!
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్‌లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత







