దీపికా పదుకొనె తెలుగులో నెక్స్‌ట్ సూపర్ స్టార్‌తోనేనా.?

- June 29, 2024 , by Maagulf
దీపికా పదుకొనె తెలుగులో నెక్స్‌ట్ సూపర్ స్టార్‌తోనేనా.?

‘కల్కి’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్ని పలకరించిన దీపికా పదుకొనె తెలుగు జనాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె పోషించిన సుమతి పాత్ర తెలుగు ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. దాంతో, బాగా ఓన్ చేసుకున్నారు దీపిక పదుకొనెని తెలుగు జనం.

ఆల్రెడీ దీపికకు ‘పద్మావత్’ తదితర తెలుగు డబ్బింగ్ సినిమాలతోనూ టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ వుంది. ఇప్పుడు స్ర్టెయిట్‌గా నటించిన ‘కల్కి’ సూపర్ హిట్ అయ్యింది. దాంతో, తెలుగులో మరిన్ని బిగ్గెస్ట్ ప్రాజెక్టులు ఆమె కోసం ఎదురు చూస్తున్నాయన్న సమాచారం అందుతోంది.

అందులో ముఖ్యంగా భారీ బడ్జెట్ మూవీ జక్కన్న క్రియేటివ్ వరల్డ్ నుంచి రాబోతున్న ప్రాజెక్టులో దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనె పేరు పరిశీలనకొచ్చిందట. గతంలోనే దీపిక పేరు లిస్టులో వున్నప్పటికీ అది ఇప్పుడు ఇంకాస్త బలపడినట్లు తెలుస్తోంది. ఒకవేళ అదే నిజమైతే తెలుగులో దీపిక హవా మొదలైనట్లే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com