హరీష్ శంకర్ మామూలోడు కాదు.! మెగాస్టార్‌నే లైన్లో పెట్టేశాడు.!
- June 29, 2024
పవన్ కళ్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరకెక్కించాల్సి వుంది. అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది.
దాంతో, ఆలస్యం చేయకుండా మాస్ రాజా రవితేజతో ‘మిస్టర్ బచ్చన్’ సినిమా పట్టాలెక్కించేశాడు హరీష్ శంకర్.
రీమేక్ మూవీనే కాబట్టి, అనుకున్నదే తడవుగా ఈ సినిమాని జెట్ స్పీడుతో పూర్తి చేసేస్తున్నాడు కూడా. ఈ లోగా మెగాస్టార్ చిరంజీవికి ఓ స్టోరీ నెరేట్ చేశాడట.
ఆ స్టోరీ పట్ల చిరంజీవి కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగూ పవన్ కళ్యాణ్‌తో సినిమా ఇప్పట్లో వుండేలా లేదు. సో, ‘మిస్టర్ బచ్చన్’ తర్వాత వెంటనే మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా తీసేసేలా ప్లాన్ చేస్తున్నాడట హరీష్ శంకర్.
‘విశ్వంభర’ సినిమా తర్వాత చిరంజీవి కాస్త రిలాక్స్ కానున్నారు. ఆ గ్యాప్‌లో హరీష్ శంకర్ స్ర్కిప్టు ఫైనల్ చేస్తే, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేయడం ఖాయం. అయితే, ఇదంతా జరగాలంటే వచ్చే ఏడాది వరకూ ఆగాల్సిందే. అప్పటికి కానీ అటు చిరంజీవి, ఇటు హరీష్ శంకర్ ప్రస్తుతం తమ ప్రాజెక్టుల నుంచి ఖాళీ అయ్యేది లేదుగా.!
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్‌ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







