తమన్నా బాటలో రష్మిక మండన్నా
- June 29, 2024
హారర్ కామెడీ చిత్రాలకు మంచి క్రేజ్ వుందిప్పుడు. ఈ నేపథ్యంలో స్టార్ నటీనటులు ముఖ్యంగా హీరోయిన్లు ఈ జోనర్లో నటించేందుకు ముందుకొస్తున్నారు. ఆల్రెడీ తమన్నా తదితరులు ఈ జోనర్లో వరుసగా ప్రాజెక్టులు చేస్తూ వస్తున్నారు.
ఇక, ఇప్పుడు రష్మిక వంతొచ్చింది. ప్యాన్ ఇండియా హీరోయిన్గా చెలామణీ అవుతోన్న రష్మిక త్వరలో ఓ హారర్ కామెడీ చిత్రంలో నటించబోతోందట. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి దినేష్ విజన్ దర్శకత్వం వహించనున్నారు.
ప్రస్తుతం స్ర్కిప్టు దశలో వున్న ఈ సినిమాని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్‌నగర్’ అనే టైటిల్‌ని ఈ సినిమాకి పరిశీలిస్తున్నారు. యూనిక్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాని హిందీతో పాటూ తెలుగు తదితర భాషల్లోనూ విడుదల చేయనున్నారట.
ప్రస్తుతం ‘పుష్ప 2’తో పాటూ పలు క్రేజీ ప్రాజెక్టులతో శ్రీవల్లి రష్మిక బిజీగా వుంది. ఇటీవలే ‘పుష్ప 2’ నుంచి వచ్చిన సాంగ్‌లో రష్మిక సిగ్నేచర్ స్టెప్పులు ట్రెండింగ్ అవుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







