క్యారెట్ జ్యూస్‌తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.?

- June 29, 2024 , by Maagulf
క్యారెట్ జ్యూస్‌తో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.?

క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కంటి చూపును మెరుగు పరచడంలో క్యారెట్ కీలక పాత్ర వహిస్తుంది. క్యారెట్‌ని వండుకుని తినడం కన్నా, పచ్చిగా తినడంలోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అలాగే, క్యారెట్‌ని సన్నగా తరిగి జ్యూస్‌లా చేసి అందులో కొద్దిగా నిమ్మరసం చేర్చి తరచూ తాగడం అలవాటు చేసుకుంటే, చర్మ సౌందర్యం మెరుగు పడుతుంది.

అంతేకాదు, భయంకరమైన మహమ్మారి క్యాన్సర్‌ని నిరోధించడంలో క్యారెట్ కీలక పాత్ర వహిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా వుంచేందుకు క్యారెట్ సహాయపడుతుంది.

క్యారెట్ రెగ్యులర్‌గా తమ డైట్‌లో చేర్చుకున్న వారికి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని విటమిన్ ఎ మరియు సి గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సహాయ పడతాయ్. అలాగే పొటాషియం పుష్కలంగా వుండే క్యారెట్ తినడం వల్ల రక్తపోటు అదుపులో వుంటుంది.

సీజనల్‌గా వచ్చే ఫ్లూ వంటి వ్యాధుల, ఇన్ఫెక్షన్ల బారి నుంచి తప్పించుకోవాలంటే క్యారెట్ జ్యూస్ రెగ్యులర్‌గా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com