ఏడాది పొడవునా ఫ్రీ మెడికల్ చికిత్సలు
- June 30, 2024
దుబాయ్: వాలంటీర్ గా వైద్యులు ప్రతి శుక్రవారం 300 మందికి పైగా రోగులకు ఉచిత చికిత్స అందిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి ప్రతివారం వచ్చే వారికి ఉచిత వైద్య పరీక్షలు మరియు చికిత్సలను అందజేస్తున్నారు. గత రమదాన్ సందర్భంగా దుబాయ్‌లో తడవి హెల్త్ గ్రూప్ ప్రారంభించిన ఈ హ్యుమానిటీ కార్యక్రమం.. దుబాయ్‌లోని దేరా లోని తడవి హెల్త్ సెంటర్‌లో ఏడాది పొడవునా ప్రతి శుక్రవారం కొనసాగించాలని నిర్ణయించుకుంది. ఇప్పటివరకు 1,000 మందికి పైగా పేద రోగులకు చికిత్స అందించారు. ఈ చొరవలో భాగంగా పేదవారికి వైద్య సేవలు ఉచితంగా అందించడం జరుగుతుందని భారతదేశానికి చెందిన డాక్టర్. షిబ్నీ బషీర్ తెలిపారు. క్లినిక్ మేనేజర్ రమేష్‌చంద్ బాలగోవిందన్ మాట్లాడుతూ..ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందించడానికి మరియు ఆర్థిక స్థోమత లేని ప్రజలకు ఆరోగ్య సంరక్షణ అందించడానికి తాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రతి శుక్రవారం 300 మందికి పైగా రోగులు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం







