నీజెన్ డయాగ్నోస్టిక్స్ ప్రారంభం
- July 01, 2024విజయవాడ: మహా నగరాలకు మాత్రమే పరిమితమైన అత్యున్నత శ్రేణి డయాగ్నోస్టిక్ సేవలను ప్రజలందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన నీజెన్ డయాగ్నోస్టిక్స్ ఆదివారం లాంఛనంగా ఆరంభమైంది. ప్రకాశం రోడ్డులోని నీజెన్ డయాగ్నోస్టిక్స్ ను రెయిన్ బో హాస్పిటల్స్ సీఎండీ రమేష్ కంచర్ల ప్రారంభించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా, ప్రపంచ స్థాయి వ్యాధి నిర్ధారణ వ్యవస్థగా నీజెన్ సేవలందించనుంది. ఈ సందర్భంగా, రెయిన్ బో హాస్పిటల్స్ సీఎండీ రమేష్ కంచర్ల మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి డయాగ్నోస్టిక్ సేవలను నగరంలో అందుబాటులోకి తేవడం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటి అత్యాధునిక రిఫరల్ ల్యాబ్, స్పెషాలిటీ ల్యాబ్స్, జినోమిక్స్.. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించేందుకు ఉపకరిస్తాయని రమేష్ కంచర్ల తెలిపారు. అనంతరం, నీజెన్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రకాష్ మాట్లాడుతూ.. నిర్దిష్ట కాల వ్యవధిలో, అత్యంత కచ్చితంగా పరీక్షల ఫలితాలను అందిస్తామని చెప్పారు. మెట్రో నగరాల్లోని ల్యాబ్ ల నుంచి ఫలితాల కోసం రోజుల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేకుండా, అత్యాధునిక సాధనా సంపత్తి, నిష్ణాతులైన శాష్ట్రవేత్తలు, పరిశోధకులు, క్లినికల్ బృందాలతో నీజెన్ రూపుదిద్దుకుందని తెలియజేశారు. రిపోర్టులు వేగంగా అందజేయడం ద్వారా అత్యవసర స్థితిలో ఉన్న పేషెంట్లకు త్వరితగతిన చికిత్సలు అందించేందుకు అవకాశం లభిస్తుందని అన్నారు. నీజెన్ లోని జినోమిక్స్ విభాగం ద్వారా, జన్యు సంబంధిత విశ్లేషణలు జరిపి భవిష్యత్తులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ఇప్పుడే తెలుసుకోవచ్చని వెల్లడించారు. జినోమిక్స్ పరీక్షల ద్వారా పేషెంటుకు అనుకూలమైన ఔషధాలను మాత్రమే సూచించే అవకాశం వైద్యులకు లభిస్తుందని, తద్వారా ఔషధాల దుష్ప్రభావాలకు లోనవ్వకుండా పేషెంట్లకు రక్షణ లభిస్తుందని వెల్లడించారు. నీజెన్ డయాగ్నోస్టిక్స్ నందు.. జెనెటిక్స్, జినోమిక్స్, ఫార్మాకోజినోమిక్స్, మైక్రో బయాలజీ, మాలిక్యులర్ బయాలజీ, రేడియాలజీ, బయో కెమిస్ట్రీ, పాథాలజీ, హెమటాలజీ ఫ్లోసైటోమెట్రీ, ఇమ్యూనాలజీ, యాంటీ నేటల్, ప్రీ నేటల్, న్యూబోర్న్ స్క్రీన్ తదితర రెండు వేల రకాలకు పైగా పరీక్షలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ రామ్ ప్రకాష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పవర్ మెక్ ప్రాజెక్ట్ సీఎండీ సజ్జా కిషోర్ బాబు, నగరంలోని పలువురు వైద్య ప్రముఖులు, అంతర్జాతీయ డయాగ్నోస్టిక్స్ సాధన సంపత్తి ఉత్పత్తి సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రముఖ గాయకుడు వై.ఎస్.రామకృష్ణకు ఎన్టీఆర్ వంశీ గ్లోబల్ అవార్డు
- నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన వైసీపీ
- మహా కుంభమేళాలో వైభవంగా శ్రీ శ్రీనివాస కళ్యాణం
- మైదుకూరులో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- సింగపూర్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్
- గన్నవరం ఎయిర్ పోర్ట్ కు అమిత్ షా
- డేటా సెంటర్లకు రాజధానిగా హైదరాబాద్..
- దుబాయ్ హిందూ మందిరానికి అరుదైన గౌరవం
- ప్రపంచ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో యూఏఈ కీలకం..!!
- సౌదీలో 2.9 మిలియన్లకు పైగా క్యాప్గాన్ పిల్స్ సీజ్..!!