2030 నాటికి దుబాయ్ లో 32 కొత్త మెట్రో స్టేషన్లు
- July 01, 2024
యూఏఈ: ఎమిరేట్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆదివారం దుబాయ్ మెట్రో డెవలప్‌మెంట్ ప్లాన్‌ను ఆమోదించింది. రాబోయే కొద్ది సంవత్సరాల్లో ప్రయాణికుల కోసం మరిన్ని స్టేషన్‌లను అందుబాటులోకి తేనున్నారు. 2030 నాటికి 84 చదరపు కిలోమీటర్లలో ఉన్న 64 స్టేషన్‌లను 140 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ 96 స్టేషన్‌లకు పెంచడం ఈ విస్తరణ లక్ష్యం. ఈ ప్రణాళిక షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మరియు షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ అల్ మక్తూమ్ దృష్టిలో భాగంగా తీసుకురానున్నారు. ప్రజా రవాణా వాటాను 45 శాతానికి పెంచడం, తలసరి కార్బన్ ఉద్గారాలను 16 టన్నులకు తగ్గించడం, నడకను ప్రోత్సహించడానికి బహిరంగ ప్రదేశాల నాణ్యతను మెరుగుపరచడం మరియు నీడ ఉన్న ప్రాంతాలను పెంచడం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నారు. మెట్రో డెవలప్‌మెంట్ ప్లాన్‌తో పాటు, కౌన్సిల్ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ఆమోదించారు. ఇది 2033 నాటికి దుబాయ్‌కి Dh650 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ఉంది.
తాజా వార్తలు
- అనుమతి లేకుండా వ్యక్తిగత డేటా బహిర్గతం..తీవ్రమైన నేరం..!!
- అబుదాబి-దుబాయ్ E11లో EV మెగాహబ్..!!
- 1,197 మంది ప్రవాసులను బహిష్కరించిన కువైట్..!!
- ముసందంలో డిస్కవరీ డైవింగ్ సెంటర్.. టూరిజానికి బూస్ట్..!!
- 2025లో కుటుంబం,బాలల రక్షణకు 4,400 రిపొర్టులు..!!
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!







