అల్లరి నరేష్.! ఎందుకు తగ్గాలి ఎవరి కోసం తగ్గాలి.?

- July 01, 2024 , by Maagulf
అల్లరి నరేష్.! ఎందుకు తగ్గాలి ఎవరి కోసం తగ్గాలి.?

‘తగ్గేదేలే’ అంటూ ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎవరి నోట విన్నా.. ఏ సందర్భమైనా ఈ మాటను చాలా ఈజీగా వాడేస్తున్నారందరూ ‘పుష్ప’ తర్వాత.

ఇప్పుడు అల్లరి నరేష్ వచ్చాడు. ‘ఎవరి కోసం తగ్గాలి.. ఎందుకు తగ్గాలి..’ అంటూ ఇంకాస్త ముందుకెళ్లాడు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘బచ్చల మల్లి’. మొన్నా మధ్య రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్‌తోనే అల్లరోడు మంచి మార్కులు కొట్టేశాడు.

తాజాగా ఆయన పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో అల్లరి నరేష్ ఈ డైలాగ్ పలుకుతున్నాడు. గెటప్ చూస్తే కాస్త ‘పుష్ప’ పోలికలున్నాయ్.

ఒక్కటే చేత్తో మందు బాటిల్‌లోంచి గ్లాస్‌లోకి మందును పోస్తూ ఓ సీరియస్ యాక్షన్ సీన్‌లో వున్న అల్లరి నరేష్ చేత డైరెక్టర్ ఈ డైలాగ్ పలికించాడు. డైలాగ్‌కీ ఓ రేంజ్‌లో రెస్పాన్స వస్తోంది. సినిమాలో ఇలాంటివి ఇంకెన్ని డైలాగులున్నాయో ఏమో కానీ, ఇప్పటికైతే ‘పుష్ప’ డైలాగ్‌ని ‘బచ్చల మల్లి’గాని డైలాగ్ కొట్టేసిందంతే.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com