213 మంది ఖైదీలకు క్షమాభిక్ష పెట్టిన తెలంగాణ ప్రభుత్వం
- July 02, 2024
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించింది. దీర్ఘకాలంగా జైళ్లలో మగ్గుతున్న తమ కుటుంబ సభ్యులను విడుదల చేయాలంటూ ఖైదీల కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజా పాలనలో దరఖాస్తులు అందజేశారు. స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ఆధారంగా ఖైదీల ముందస్తు విడుదలకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.
దరఖాస్తులను పరిశీలించిన సీనియర్ అధికారులు, అర్హులైన వారి వివరాలను హైలెవల్ కమిటీ ముందుంచారు. హైలెవల్ కమిటీ విడుదలకు అర్హులైన ఖైదీల జాబితాను క్యాబినెట్ ముందు ఉంచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని క్యాబినెట్ ఖైదీల విడుదలకు ఆమోదముద్ర వేసింది. అనంతరం ఆ జాబితాకు గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ఖైదీల ముందస్తు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం చర్లపల్లి జైలు నుంచి 213 మంది ఖైదీలు బుధవారం విడుదల కానున్నారు. వీరిలో 205 మంది యావజ్జీవ శిక్ష పడిన వారు, ఎనిమిది మంది తక్కువ కాలం శిక్షపడిన వారు. వీరందరికి జైలులో వివిధ వృత్తులకు సంబంధించిన నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఇచ్చారు. మెరుగైన ప్రవర్తన ద్వారా సమాజంలో తిరిగి కలిసిపోవడానికి వారందరికీ కౌన్సెలింగ్ ఇప్పించారు.
తాజా వార్తలు
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్
- వందేమాతరం తరతరాలకు ఓ స్ఫూర్తి: ప్రధాని మోదీ
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!







