బహ్రెయిన్ లో కుటుంబానికో కారు.. పాలసీపై జోరుగా చర్చ..!
- July 03, 2024
మనామా: బహ్రెయిన్ పెరుగుతున్న ట్రాఫిక్ సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. ఇది నివాసితులతోపాటు మౌలిక సదుపాయాలపై అధిక ప్రభావం చూపుతోంది. రోడ్లపై వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతుండడంతో ప్రతి కుటుంబానికి కేవలం ఒక కారుని పరిమితం చేసే పాలసీపై జోరుగా చర్చలు మొదలయ్యాయి. ఒక్కో కుటుంబానికి ఒక కారు పాలసీ రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించడంతోపాటు రోడ్లపై నెలకొన్న ట్రాఫిక్ సంక్షోభాన్ని సమర్ధవంతంగా తగ్గించగలదని నిపుణులు అంచనా వేస్తున్నారు. "రోడ్డుపై తక్కువ కార్లు అంటే తక్కువ ఇంధన వినియోగం, తక్కువ ఉద్గారాలు మరియు మా పట్టణ ప్రణాళికపై ఒత్తిడి తగ్గుతుంది" అని నివాసి అబెల్ చెప్పారు. ఇది మరింత నివాసయోగ్యమైన మరియు పర్యావరణ అనుకూలమైన బహ్రెయిన్‌కు దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..
- మంత్రులు, కార్యదర్శుల మీటింగ్‌లో సీఎం చంద్రబాబు సీరియస్..
- PSLV-C62 సిగ్నల్ కట్.. సగం దూరం వెళ్లాక..
- ఇజ్రాయెల్ పై దాడి చేస్తాం అంటూ ట్రంప్ కు వార్ణింగ్ ఇచ్చిన ఖమేనీ







