మాస్ కా దాస్ కొత్త అవతారం.! ఈ ‘లైలా’ మీకు తెలుసా.?
- July 03, 2024
హీరోలు లేడీ గెటప్స్ వేయడం తెలిసిన సంగతే. ఏవో కొన్ని సన్నివేశాల వరకూ మాత్రమే కాకుండా కొందరు హీరోలయితే పూర్తిగా లేడీ గెటప్‌లోనే కనిపించి సినిమాలు చేసి సెన్సేషన్స్ క్రియేట్ చేశారు గతంలో.
ముఖ్యంగా ఆ కేటగిరి అంటే గుర్తొచ్చేది సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్. ఆయన లేడీ గెటప్‌లో నటించిన చిత్రం ‘మేడమ్’ అప్పట్లో ఓ సెన్సేషన్. ఆ తర్వాత ఈ తరం హీరోల్లో తమిళ హీరో శివ కార్తికేయన్ అదే తరహా ఫుల్ లెంగ్త్ పాత్రలో నటించి మరో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఆ సినిమానే ‘రెమో’.
తమిళంతో పాటూ తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది ఈ సినిమా. ఇప్పుడు మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కూడా ఈ జోనర్‌లో సినిమా అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు.
ఆ సినిమా పేరు ‘లైలా’. టైటిల్‌తోనే సగం మార్కులు కొట్టేశాడు. ఇక, ఫస్ట్ లుక్ విషయానికి వస్తే, లైలాగా విశ్వక్ సేన్ స్టన్నింగ్ లుక్స్ కెవ్వు కేక పెట్టిస్తున్నాయ్. ఇంతవరకూ మాస్ కా దాస్ అంటే మాస్ అండ్ యూత్ హీరో. ఇకపై అమ్మాయిలకు ఈర్ష్య పుట్టే అందంతో అలరించబోతున్నాడు ‘లైలా’గా.
త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తి పెంచేశారు. రామ్ నారాయణ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. చూడాలి మరి లైలాగా విశ్వక్ ఎలాంటి సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ కానున్నాడో.!
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!