మొన్న ప్రబాస్‌కి, ఇప్పుడు మహేష్‌కి.! విశ్వరూపం చూపించబోతున్న మలయాళ స్టార్.!
- July 03, 2024
ప్రబాస్ హీరోగా భారీ అంచనాలతో వచ్చిన ‘సలార్’ సినిమా తెలిసిందే. ఈ సినిమాలో ప్రబాస్‌కి స్నేహితుడిగా అలాగే బద్ధ శత్రువుగా రెండు డిఫరెంట్ వేరియేషన్లలో పృద్వీ రాజ్ నటించారు. మొదటి పార్ట్ ‘సలార్’లో కేవలం ప్రబాస్ స్నేహితుడిగా మాత్రమే కనిపించిన మలయాళ స్టార్ పృద్ధీ రాజ్ సుకుమారన్ రెండో పార్ట్‌లో భయంకరమైన విలన్‌గా కనిపించబోతున్నాడు.
ఆ సంగతి అటుంచితే, ఈయనకు తెలుగులో మరో భారీ ప్రాజెక్ట్ తగిలింది. జక్కన్న రాజమౌళి తెరకెక్కించబోయే ప్యాన్ వరల్డ్ మూవీ కోసం విలన్‌గా పృద్వీ రాజ్ సుకుమారన్ పేరు పరిశీలిస్తున్నారట. దాదాపు ఖాయమైనట్లే అని తెలుస్తోంది.
ఈ సినిమాని ఈ ఏడాదిలోనే ప్రారంభించబోతున్నారు జక్కన్న. ప్రస్తుతం కాస్టింగ్ వర్క్ జరుగుతోంది. ఇటీవలే స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక రేపో, మాపో రాజమౌళి ఈ సినిమాని పట్టాలెక్కించేయనున్నారు.
ప్రపంచ యాత్రలు, సాహసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతోందని గతంలోనే రాజమౌళి చెప్పేశారు. ఇక, వన్స్ ట్రాక్ ఎక్కేస్తే.. ఏదో ఒక అప్డేట్ రిలీజ్ చేస్తూ.. సినిమాపై అంచనాల్ని క్రియేట్ చేస్తూనే వుంటారు రాజమౌళి. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







