నవదీప్ ‘లవ్ మౌళి’.! ఏం తీశాడ్రా.! బ్యూటిఫుల్ విజువల్ ఫీస్ట్.!
- July 03, 2024
కొన్ని సినిమాలకు ధియేటర్లలో పెద్దగా ఆదరణ దక్కకపోయినా ఓటీటీలో సూపర్ హిట్స్ అవుతున్నాయ్. ఈ మధ్య ‘లవ్ మౌళి’ అనే ఓ బోల్డ్ సినిమా గురించి ఓ మోస్తరు టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. యంగ్ హీరో నవదీప్ మెయిన్ లీడ్ పోషించిన ఈ సినిమాని బోల్డ్ మూవీగా ప్రొజెక్ట్ చేశారు.
దారుణమైన ఇంటిమేట్ సీన్లు, గాఢమైన లిప్‌లాకులు.. అంటూ ఊదరగొట్టారు. దాంతో ఓటీటీ జనం ఈ సినిమాని ఫ్యామిలీతో చూసేందుకు ఇబ్బంది పడ్డారు.
అయితే, సినిమాలో అలాంటి వల్గర్ సీన్లేమీ లేవు. ఓ మంచి కాన్సెప్ట్. విజువల్ ఫీస్ట్.. చాలా చాలా ఆర్టిస్టిక్ సినిమాటోగ్రఫీ.. అని ఓటీటీలో ఈ సినిమాని వీక్షించిన ప్రేక్షకుల నుంచి అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
నిజంగానే ‘లవ్ మౌళి’ ఓ అద్భుతమైన సినిమా. ప్రస్తుతం వున్న సినిమాల్లో లిప్‌లాక్స్ అనేవి చాలా చాలా కామన్ అయిపోయాయ్. కొన్ని లిప్ లాక్స్లో అయితే ఎలాంటి షరతులు (‘ఎ’ సర్టిఫికెట్ అలర్ట్) లేకుండానే గాఢమైన రొమాంటిక్ సన్నివేశాలుంటున్నాయ్.
కానీ, బోల్డ్ ప్రచారం జరిగిన ‘లవ్ మౌళి’లోని రొమాంటిక్ సన్నివేశాలు ఆర్టిస్టిక్‌గా అనిపించాయే తప్ప వల్గర్‌గా అనిపించలేదు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన పంకురి గిద్వానీ నాలుగు డిఫరెంట్ వేరియేషన్స్ వున్న పాత్రల్లో అందంగా అభినయం చూపించింది.
ఓటీటీలో చూడాలనుకునేవాళ్లు ప్రముఖ ఓటీటీ ఛానెల్ ఆహా వేదికగా ఈ సినిమాని నిరభ్యంతరంగా వీక్షించొచ్చు. అందమైన లొకేషన్లు, అద్భుతమైన సినిమాటోగ్రఫీని చూసి ఆహ్లాదంగా ఫీలవ్వొచ్చు. కొత్త కాన్సెప్టులతో సినిమాలు తెరకెక్కించాలనుకునేవాళ్లకి ‘లవ్ మౌళి’ ఓ బెస్ట్ ఇన్సిప్రేషన్.!
తాజా వార్తలు
- ఆసియా కప్ 2025: పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం..
- బహ్రెయిన్‌లో డేంజరస్ యానిమల్స్ పై కఠిన చట్టం..!!
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!