23 ఏళ్ల వ్యక్తికి 30,000 దిర్హామ్‌ల జరిమానా
- July 05, 2024
దుబాయ్: మాదకద్రవ్యాల వినియోగానికి పాల్పడిన అరబ్ వ్యక్తికి 30,000 దిర్హామ్ జరిమానా విధించారు. రెండేళ్లపాటు ఇతరులకు లేదా ఇతరుల ద్వారా డబ్బును బదిలీ చేయడం లేదా డిపాజిట్ చేయకుండా ఆంక్షలు విధించారు. మాదకద్రవ్యాల వినియోగం మరియు నగదు బదిలీకి సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినందుకు 23 ఏళ్ల వ్యక్తికి దుబాయ్ క్రిమినల్ కోర్టు జరిమానా విధించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, యూఏఈ సెంట్రల్ బ్యాంక్ అనుమతితో మాత్రమే నిందితులు బ్యాంక్ సేవలను ఉపయోగించుకోవచ్చని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
జనవరి 16 అల్ బార్షా పోలీస్ స్టేషన్ పరిధిలో చట్టపరమైన ప్రిస్క్రిప్షన్ లేకుండానే నిందితుడు మెథాంఫేటమిన్ మరియు యాంఫేటమిన్ అనే రెండు సైకోయాక్టివ్ పదార్ధాలను రెండవసారి వినియోగించినట్లు గుర్తించారు. అతను మరొక వ్యక్తికి చెందిన బ్యాంకు ఖాతాకు డబ్బును బదిలీ చేయడం ద్వారా డ్రగ్స్ కోసం చెల్లించాడని కూడా న్యాయవాదులు తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో చెల్లించని ప్రతి 100 దిర్హామ్‌లకు ఒక రోజు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు తెలిపారు.
తాజా వార్తలు
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్‌లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్‌ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్‌టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!







