‘పుష్ప’ గా అంజలి డిఫరెంట్ పర్ఫామెన్స్.!
- July 05, 2024
తెలుగమ్మాయ్ అంజలి పర్ఫామెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆమె ఏ పాత్రలో కనిపించినా ఆ పాత్రకు అందం తెచ్చిపెట్టేస్తుంటుంది. అయితే, రీసెంట్గా అంజలి పోషించిన వేశ్య పాత్ర మాత్రం భిన్న రెస్పాన్స్ అందుకుంది.
ప్రముఖంగా చెప్పాలంటే ట్రోలింగ్స్‌కి గురైంది ఈ పాత్ర. విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’లో అంజలి ‘రత్నమాల’ అనే వేశ్య పాత్రలో నటించింది. తన వరకూ తాను బాగానే నటించింది కానీ, ఈ పాత్రలో అంజలి కనిపించడం అంత అవసరమా.? అన్న కామెంట్లు వచ్చాయ్.
అఫ్కోర్స్.! ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏదో అలా అలా నిలబడినట్టే నిలబడి, పోయిందనుకోండి. అంజలి పాత్రనూ ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదెవ్వరూ. ఇక, ఇప్పుడు ‘బహిష్కరణ’ అంటూ ఓ వెబ్ సిరీస్‌తో రాబోతోంది అంజలి.
ఈ సిరీస్‌లోనూ అంజలి వేశ్య పాత్రలోనే కనిపించనుంది. మొదట్లో అమాయకత్వం నిండిన వేశ్యగా కనిపించి, ఆ తర్వాత సమాజంలోని అసమానతల్ని ఎదుర్కొనే ఓ స్త్రీగా ఎలా ఎదిగింది.? అన్న కథనంతో ఈ సిరీస్ రూపొందింది.
ఈ నెల 12 నుంచి ఓటీటీలో స్ర్టీమింగ్ కాబోతోంది ఈ వెబ్ సిరీస్. ఈ సిరీస్‌లో అంజలి ‘పుష్ప’ అనే వేశ్య పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర ఖచ్చితంగా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని అంజలి చెబుతోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్‌లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?
- మహమ్మారి సమయంలో జన్మించిన పిల్లలకు అడ్మిషన్లు..!!
- గల్ఫ్ పెట్రో కెమికల్ ఇండస్ట్రీస్ కంపెనీ యూనిట్ల పై దాడులు..!!









