హైదరాబాద్‌లో ర్యాలీ వద్దన్న ఏపీ సీఎం చంద్రబాబు..
- July 05, 2024
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగించుకుని మరికాసేపట్లో హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ వస్తున్న ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశాయి. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్ వరకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, తోరణాలతో ఈ రూటు పసుపు మాయంగా మారింది.
బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి భారీ ర్యాలీగా చంద్రబాబును ఆయన నివాసానికి తోడ్కోని పోవాలని టీడీపీ నాయకులు భావించారు. నగర వాసులు ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ర్యాలీ వద్దని టీటీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారు. బేగంపేట నుంచి నేరుగా తన కాన్వాయ్‌లో నివాసానికి ఆయన చేరుకుంటారు.
ఎయిర్‌పోర్టులోకి కొద్ది మంది నాయకులను మాత్రమే అనుమతించనున్నారు. 40 మంది తెలంగాణ తెలుగుదేశం నాయకులకు మాత్రమే చంద్రబాబును కలిసేందుకు అనుమతిస్తారని సమాచారం. వారితో మాట్లాడిన తర్వాత ర్యాలీ లేకుండానే చంద్రబాబు తన నివాసానికి వెళ్లిపోతారు. కాగా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో ఇప్పటికే బేగంపేట విమానాశ్రయానికి చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రేపు ఏపీ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. రేపు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ లో ఈ సమావేశం జరగనుంది. రెండు రాష్ట్రాల మధ్య విభజన అంశాలపై ఈ భేటీలో చర్చిస్తారు. ముఖ్యనేతల మధ్య జరిగే సమావేశానికి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణి, డ్రోన్ దాడులు..అప్రమత్తమైన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఈద్ అల్ అదా డ్రా.. Dh30 మిలియన్ల విజేతను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలపై చర్చ..బహ్రెయిన్ కీలక సూచనలు..!!
- 50% వరకు తగ్గింపు: యూఏఈ ప్రయాణికులకు చౌకైన టిక్కెట్లు ..!!
- ఈద్ అల్-అధా..బలి ఆచారాన్ని నిర్వహించిన కువైటీలు..!!
- తీవ్ర అస్వస్థత..ఈజిప్ట్ నుండి విమానంలో సౌదీ పౌరుల తరలింపు..!!
- 2026లో నిలకడగా ఖతార్ హాస్పిటాలిటీ సెక్టర్..!!
- ఎలిమినేటర్‌లో హైదరాబాద్‌కు బిగ్ షాక్..
- ఫైటర్ జెట్ల తయారీకి గ్రీన్ సిగ్నల్
- ఎవరెస్ట్ శిఖరం పై హైదరాబాదీ మృతి..









