‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ ఇచ్చేసిన శంకర్.!

- July 09, 2024 , by Maagulf
‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ ఇచ్చేసిన శంకర్.!

మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో ఎప్పుడో పట్టాలెక్కిన చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఇంతవరకూ ఈ సినిమా స్టేటస్ ఏంటో తెలియ రాలేదు.
కానీ, ‘ఇండియన్ 2’ సినిమా ప్రమోషన్ల పేరు చెప్పి, శంకర్ స్వయంగా ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ ఇచ్చేశాడు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
హమ్మయ్యా.! అని ఊపిరి పీల్చుకుంటున్నారు. రామ్ చరణ్ షూటింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందనీ, మరో పది రోజులు షూటింగ్ మాత్రమే మిగిలుందనీ, ఇక, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేస్తామనీ శంకర్ తెలిపారు.
బహుశా సెప్లెంబర్‌లో ఈ సినిమా రిలీజ్ వుండొచ్చని అంటున్నారు. అంతేకాదు, రామ్ చరణ్ వంటి నటుడితో సినిమా చేయడం తనకెంతో ఆనందంగా వుందని శంకర్ వంటి ఓ స్టార్ డైరెక్టర్ చెప్పడం మరింత ఆశ్చర్యకరమైన విషయం.
మరోవైపు రామ్ చరణ్ కూడా ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. ‘గేమ్ ఛేంజ్ చేయడానికి గేమ్ ఛేంజర్‌గా వస్తున్నా.. సినిమాలో కలుద్దాం..’ అంటూ షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దాంతో, మొత్తానికి ‘గేమ్ ఛేంజర్’ ముందుకు కదిలినట్లయ్యింది. ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. అంజలి, కైరా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com