రోబో కృతి సనన్‌కి ఓటీటీలో పిచ్చ పిచ్చగా క్రేజ్.!
- July 09, 2024
పొడుగు కాళ్ల సుందరి కృతి సనన్ తెలుగు ప్రేక్షకులకీ సుపరిచితురాలే. తెలుగులో ‘వన్ - నేనొక్కడినే’ సినిమాతో పరిచయమైంది. ఆ తర్వాత ‘దోచేయ్’, ‘ఆది పురుష్’ సినిమాల్లోనూ నటించింది కానీ, ఏమంత ఆదరణ దక్కించుకోలేకపోయింది.
కానీ, బాలీవుడ్లో కృతి సనన్ స్టార్ హీరోయిన్ ఇప్పుడు. ఆమె ఎంచుకుంటున్న కథలే ఆమెను అక్కడ స్టార్‌ని చేశాయ్. గతంలో ‘మిమి’ తదితర చిత్రాలు కృతి సనన్‌కి మంచి గుర్తింపు తీసుకొచ్చాయ్.
లేటెస్ట్గా ‘తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా’ అనే సినిమాలో కృతి సనన్ నటించింది. షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాలో కృతి సనన్ ‘సిప్రా’ అనే రోబో పాత్ర పోషించింది. రోబో పాత్రలో కృతి సనన్ చాలా చాలా అందంగా కాన్ఫిడెంట్‌గా నటించేసింది.
ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో వుంది. ఓటీటీలో భాషతో సంబంధం లేకుండా ఈ సినిమాని తెగ ఆదరిస్తున్నారు. రోబోతో లవ్‌లో పడే ఓ హ్యూమన్ కథే ఈ సినిమా.
చాలా ఆహ్లాదంగా, ఫ్యామిలీ ఆడియన్స్‌ని కట్టి పడేసేలా ఈ సినిమాని తీర్చి దిద్దారు మేకర్లు. ముఖ్యంగా కృతి సనన్ తనదైన నటనతో ఓటీటీ ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. ప్రముఖ ఓటీటీ ఛానెల్ అమెజాన్ ప్రైమ్ వేదికగా ఈ సినిమా స్ర్టీమింగ్ అవుతోంది. టాలీవుడ్ కృతి సనన్‌కి కలిసి రాకపోయినా, ఓటీటీ పుణ్యమా అని ఇలాగైనా కృతి సనన్ టాలెంట్‌ని తెలుగు ప్రేక్షకులు గుర్తిస్తున్నారన్న మాట.!
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







