ఓటీటీలో త్రిష .! విశ్వరూపం చూపించబోతోందిగా.!
- July 09, 2024
వెండితెరపై అద్భుతాలు సృష్టించిన కొందరు నటీ నటులు ఇప్పుడు ఓటీటీ తెరపైనా సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. నిజానికి మొదట్లో వెండితెరపై ఫామ్‌లో లేని నటీ నటులే ఓటీటీ తెరపై కనిపించేవారు కొత్తగా సరికొత్తగా.
అలా ఎంతో మందికి ఓటీటీ ఓ మంచి టాలెంటెడ్ ప్లాట్‌పామ్ అవుతోందని సంబరపడ్డారు. ఆ తర్వాత మెల్ల మెల్లగా ఓటీటీకి ప్రేక్షకులు బాగా అలవాటు పడ్డారు. ఎంతలా అంటే, ధియేటర్లకు పోయి సినిమాలు చూడడం మానేసేంతలా.!
దాంతో ఫామ్‌లో లేని నటీ నటులే కాదు, సీనియర్ ప్రముఖ స్టార్లు కూడా ఓటీటీ కంటెంట్‌పై ఫోకస్ పెడుతున్నారు. అలా ఇప్పటికే ముద్దుగుమ్మలో తమన్నా, కాజల్, సమంత, బాలీవుడ్ నుంచి కూడా ప్రియాంకా చోప్రా తదితరులు ఓటీటీలో సత్తా చూపించారు. చూపిస్తున్నారు కూడా.
ఇక ఇప్పుడు సీనియర్ నటి త్రిష కూడా ఓటీటీలో సందడి చేయబోతోంది. త్రిష నటించిన ‘బృందా’ అనే వెబ్ సిరీస్ త్వరలో ఓటీటీలో సందడి చేయబోతోంది. ఈ సిరీస్‌కి సంబంధించిన టీజర్ లేటెస్ట్‌గా రిలీజైంది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో రూపొందిన ఈ వెబ్ సిరీస్‌లో త్రిష తన నటనతో ఎలాంటి కొత్తదనం చూపించబోతోందో చూడాలి మరి.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







