హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి..

- July 10, 2024 , by Maagulf
హైదరాబాద్‌లో మరో కేబుల్ బ్రిడ్జి..

హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మరో కేబుల్ బ్రిడ్జి రాబోతోంది. ప్రస్తుతం దుర్గం చెరువుపై కేబుల్ బ్రిడ్జి వాహనదారులకు అందుబాటులో ఉండగా, మీరాలం చెరువు ట్యాంకుపై మరో ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి రానుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. రూ.381 కోట్ల వ్యవయంతో రెండేళ్లలో మీరాలం చెరువు కేబుల్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేలా హెచ్ఎండీఏ ఓ కన్సల్టెన్నీ ద్వారా ప్రతిపాదనలు సిద్ధి చేసింది.

మీరాలం ట్యాంక్ ఈస్ట్ సైడ్‌లో ఉన్న చింతల్‌మెంట్ రోడ్డు నుంచి ట్యాంక్ తూర్పున గల బెంగళూరు-హైదరాబాద్ నేషనల్ హైవే 44ను కనెక్ట్ చేస్తూ బ్రిడ్జి నిర్మించనున్నారు. మెుత్తం నాలుగు లైన్లతో 2.65 కిలోమీటర్ల పొడువుతో ఈ హైలెవల్ ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించనున్నారు. వంతెన పైన రెండు చోట్ల 140 మీటర్లతో ప్రవేశానికి ర్యాంపులు ఏర్పాుట చేయనున్నారు. ఒక చోట 110 మీటర్లతో ఎగ్జిట్ ర్యాంప్ ఏర్పాటు చేస్తారు. అలాగే కేబుల్ బ్రిడ్జిపై ఆకర్షణ కోసం అర్నమెంటల్ లైటింగ్ ఏర్పాటు చేస్తారు.

అలాగే మీరాలం చెరువు విశిష్టతను తెలియజేసేలా అక్కడ థీమ్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. కేబుల్ బ్రిడ్జి సమీపంలోనే ల్యాండ్ స్కేప్ డెవలప్‌మెంట్, టూరిజానికి అనుగుణంగా సందర్శకులను ఆకట్టుకునేందుకు వ్యూ పాయింట్లు, సంస్కృతి, వారసత్వ నేపథ్యాన్ని తెలియజేసేందుకు వివిధ అభివృద్ది పనులు, సమాచార కేంద్రాలు ఏర్పాుట చేసేందుకు హెచ్‌ఎండీఏ రెడీ అయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com