హత్రాస్‌లో ఘోర ప్రమాదం..ఇద్దరు మృతి..16 మందికి గాయాలు
- July 11, 2024
రోడ్డు ప్రమాదాలు అనేవి రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి తప్ప తగ్గడం లేదు. ఎన్ని రోడ్డు జాగ్రత్తలు పాటించినప్పటికీ అనుకోని ప్రమాదాలు మాత్రం అమాయకులను బలి తీసుకుంటున్నాయి. తాజాగా హత్రాస్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..16 మందికి గాయాలు అయ్యాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును డబుల్ డెక్కర్ బస్సు ఢీ కొన్నది. ఈ సంఘటన సికందరరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్రాస్‌లోని టోలి గ్రామంలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్రక్కును మియాంగాంజ్ నుంచి చండీగఢ్ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఇక చనిపోయిన వారిని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టి సారించారు, గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) అధికారిక ప్రకటన తెలిపింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..







