దుబాయ్ మాల్ సందర్శకులే లక్ష్యంగా చోరీలు.. ముఠా అరెస్ట్

- July 12, 2024 , by Maagulf
దుబాయ్ మాల్ సందర్శకులే లక్ష్యంగా చోరీలు.. ముఠా అరెస్ట్

యూఏఈ: దుబాయ్ మాల్ కు వచ్చే సందర్శకులను లక్ష్యంగా చేసుకుని వారి విలువైన వస్తువులను చోరీ చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను ఇటీవల అధికారుల బృందం పట్టుకుంది. ముఖ్యంగా దుబాయ్ మాల్ వంటి పర్యాటక ప్రదేశాలలో పిక్ పాకెటింగ్ పెరగడంతో సివిల్ డ్రెస్ లో ఉండే ప్రత్యేక బృందాన్ని దుబాయ్ పోలీసులు ఏర్పాటు చేశారు.   ఈ క్రమంలో చోరీలకు పాల్పడుతున్న 23, 28, 45 మరియు 54 సంవత్సరాల వయస్సు గల నలుగురు వ్యక్తులతో కూడిన ముఠాను మార్చి 6న రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  

కోర్టు పత్రాల ప్రకారం.. ముఠా సభ్యులు దుబాయ్ మాల్ డ్యాన్స్ ఫౌంటెన్ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.  సందర్శకులను ఏమర్చుతూ చోరీలకు పాల్పడుతున్నారు. ఓ సందర్శకురాలి   మొబైల్ ఫోన్‌ను దొంగిలించడానికి ప్రయత్నించే క్రమంలో మఫ్టీ పోలీసులకు దొరికిపోయారు.     కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి, ఒక్కొక్కరికి ఒక నెల జైలు శిక్ష విధించి, అనంతరం దేశ బహిష్కరణ విధించాలని ఆదేశించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com