రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్షు శుక్లా
- July 13, 2024
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా 2013 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి హిమాన్షు శుక్లా శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ రెండవ అంతస్తులోని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో మధ్యాహ్నం 3గం.లకు ఆయన డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం హిమాన్షు శుక్లా ఐ అండ్ పీఆర్ అధికారులతో సమావేశమై శాఖాపరమైన వివరాలను అడిగి తెలుసుకున్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖకు డైరెక్టర్ గా రావడం ఆనందంగా ఉందన్నారు.
అంతకుముందు ఐ అండ్ పీఆర్ (సమాచార పౌర సంబంధాల శాఖ) అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది హిమాన్షు శుక్లాకు ఘనస్వాగతం పలికారు. బాధ్యతల స్వీకరణ అనంతరం పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ అడిషనల్ డైరెక్టర్ శ్రీమతి ఎల్.స్వర్ణలత, జాయింట్ డైరెక్టర్లు పి.కిరణ్ కుమార్,తేళ్ల కస్తూరి, చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్ ఓ.మధుసూధన, రీజినల్ ఇన్ఫర్మేషన్ ఇంజినీర్లు సి.వి.కృష్ణారెడ్డి,నాగరాజు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఎం.భాస్కర్ నారాయణ,జీవీ.ప్రసాద్,వెంకటరాజు గౌడ్, ఎఫ్ డీసీ జనరల్ మేనేజర్ శేష సాయి, ఐ అండ్ పీఆర్ ఉద్యోగులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో మార్పు మొదలైంది: కేటీఆర్
- ఎన్టీఆర్ విద్యా సంస్థల వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు
- బ్యాంక్ సెలవుల జాబితా విడుదల
- చైనా: ప్రపంచంలోనే అతిపొడవైన టన్నెల్
- మనమా-దియార్ అల్ ముహారక్ మధ్య కొత్త బ్రిడ్జి..!!
- ఉగ్రవాదుల బాంబు దాడిని ఖండించిన ఖతార్..!!
- ప్రవాస కార్మికుల ఫుడ్ స్క్రీనింగ్ కేంద్రాలలో తనిఖీలు..!!
- ఫుడ్ ట్రక్ స్టార్టప్లకు మద్దతుగా మసార్ ప్రారంభం..!!
- కత్తితో దాడి..6 మందికి జైలు శిక్ష, బహిష్కరణ వేటు..!!







