ఇరాక్ లో రోడ్డు ప్రమాదం..బహ్రెయిన్ కు రానున్న బాధితులు..!

- July 13, 2024 , by Maagulf
ఇరాక్ లో రోడ్డు ప్రమాదం..బహ్రెయిన్ కు రానున్న బాధితులు..!

మనామా: ఇరాక్‌లో విషాదకరమైన కారు ప్రమాదంలో చిక్కుకున్న బహ్రెయిన్ కుటుంబం వచ్చే ఆదివారం తిరిగి వస్తారని భావిస్తున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు ఇప్పటికే కోలుకుని గల్ఫ్ ఎయిర్ విమానంలో చేరుకోనున్నారు. ఈ ప్రమాదం జూన్ 2024లో ఇరాక్ నగరమైన నసిరియా సమీపంలోని అంతర్జాతీయ రహదారిపై జరిగింది. ఇందులో ఒక కుటుంబ సభ్యుడు ఫౌజియా అల్ నజ్జర్ ప్రాణాలు కోల్పోయారు. సదరు కుటుంబం ఇరాక్‌లో ప్రయాణిస్తుండగా వారి వాహనం ప్రమాదానికి గురైంది.  మరో ఆరుగురు కుటుంబ సభ్యులు గాయపడ్డారు. వారందరూ నసిరియాలోని ఆసుపత్రిలో చికిత్స పొందారు. గాయపడిన వారిలో 15 ఏళ్ల బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నాడు. కుటుంబంలోని ఇద్దరు మహిళలు ప్రమాదంలో ఫ్రాక్చర్లకు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్నారు. గాయపడిన వారిలో చాలా మంది బహ్రెయిన్‌కు తిరిగి రావడానికి ఎదురుచూస్తున్నారని అధికార వర్గాలు ధృవీకరించాయి. తమకు అండగా నిలిచిన ఇరాక్‌లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com