ప్రపంచంలోని బెస్ట్ క్యారియర్‌గా ఖతార్ ఎయిర్‌వేస్ కార్గో..!

- July 13, 2024 , by Maagulf
ప్రపంచంలోని బెస్ట్ క్యారియర్‌గా ఖతార్ ఎయిర్‌వేస్ కార్గో..!

దోహా: ఖతార్ ఎయిర్‌వేస్ కార్గో 2023/24లో ప్రపంచంలోని ప్రముఖ ఎయిర్‌ఫ్రైట్ క్యారియర్‌గా తన స్థానాన్ని నిలుపుకుంది. తన చివరి బోయింగ్ 747 విమానానికి రిటైర్ మెంట్ ప్రకటించింది. 2023/24 ఆర్థిక సంవత్సరంలో QR239bn ($63.1bn) కంటే ఎక్కువ విలువైన 236 విమానాలను కొనుగోలు చేశామని,  భవిష్యత్తు విస్తరణ కోసం గ్రూప్‌ను అవి నిలబెట్టాయని ఖతార్ ఎయిర్‌వేస్ గ్రూప్ వార్షిక నివేదిక పేర్కొంది. ఖతార్ ఎయిర్‌వేస్ దాని ఆధునిక ఇంధన-సమర్థవంతమైన విమానాలకు ప్రసిద్ధి చెందింది.  గత ఆర్థిక సంవత్సరంలో గ్రూప్ 25 కంటే ఎక్కువ అదనపు విమానాలను కొనుగోలు చేసింది. ఇందులో తొమ్మిది బోయింగ్ 737 MAX-8, ఐదు ఎయిర్‌బస్ A350-1000, ఏడు బోయింగ్ 787-9, మూడు బోయింగ్ 777-300ER మరియు ఒక బోయింగ్ 777-F విమానాలు ఉన్నాయి. మార్చి 31 నాటికి మొత్తం విమానాల సంఖ్య 284కి చేరింది.  వీటిలో 230 ప్రయాణీకుల కోసం, 29 ఖతార్ ఎయిర్‌వేస్ కార్గో కోసం మరియు 25 ఖతార్ ఎగ్జిక్యూటివ్ కోసం సర్వీసులను అందస్తున్నాయి.  ఖతార్ జాతీయ క్యారియర్ ప్రపంచవ్యాప్తంగా 170 కంటే ఎక్కువ గమ్యస్థానాలకు కనెక్టివిటీని అందిస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com