షార్జా మీడియా కౌన్సిల్ ఏర్పాటు..డిక్రీ జారీ
- July 13, 2024
యూఏఈ: షార్జా డిప్యూటీ పాలకుడు షేక్ సుల్తాన్ బిన్ అహ్మద్ అల్ ఖాసిమి అధ్యక్షతన షార్జా మీడియా కౌన్సిల్ (SMC) ఏర్పాటు కానుంది. ఈ మేరకు సుప్రీం కౌన్సిల్ సభ్యుడు, షార్జా పాలకుడు అయిన హిస్ హైనెస్ డా. షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ ఖాసిమి ఎమిరి డిక్రీని జారీ చేశారు. కౌన్సిల్ సభ్యులుగా మహమ్మద్ హసన్ ఖలాఫ్ - షార్జా బ్రాడ్‌కాస్టింగ్ అథారిటీ డైరెక్టర్ జనరల్, తారిక్ సయీద్ అల్లాయ్ - షార్జా ప్రభుత్వ మీడియా బ్యూరో డైరెక్టర్ జనరల్, హసన్ యాకూబ్ అల్ మన్సూరీ - షార్జా మీడియా కౌన్సిల్ సెక్రటరీ జనరల్, రషీద్ అబ్దుల్లా అల్ ఒబెద్ – షార్జా మీడియా సిటీ డైరెక్టర్ (షామ్స్), సేలం అలీ హమద్ అల్ ఘైతీ – షార్జా బ్రాడ్‌కాస్టింగ్ అథారిటీ డైరెక్టర్, అలియా అల్ సువైదీ – షార్జా గవర్నమెంట్ మీడియా బ్యూరో డైరెక్టర్, హెస్సా అబ్దుల్లా అల్ హమ్మదీ – షార్జా మీడియా అసిస్టెంట్ సెక్రటరీ జనరల్ కౌన్సిల్ గా నియమితులయ్యారు. కౌన్సిల్‌లో సభ్యత్వం పదవీకాలం నాలుగు సంవత్సరాలు అని డిక్రీలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!







