జాన్వీ కపూర్ టాలీవుడ్లో మరో క్రేజీ ఆఫర్.!
- July 16, 2024
అతిలోక సుందరి జాన్వీ కపూర్ టాలీవుడ్లో వరుస ఆఫర్లు పట్టేస్తోంది. ఎంతో టైమ్ పట్టదు తెలుగులో స్టార్ హీరోయిన్ అనిపించుకోవడానికి జాన్వీ కపూర్‌కి. ఎప్పటి నుంచో ఆశిస్తున్న వైనం ఇది. ఇప్పటికి నెరవేరింది.
వస్తూ వస్తూనే రెండు బిగ్ ఆఫర్లు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అందులో ఫస్ట్ ఆఫర్ ‘దేవర’ కాగా, రెండోది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ జాన్వీ కపూర్ తలుపు తట్టినట్లు సమాచారం. ‘దసరా’ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఈయన దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కనుంది.
అందులోనూ నేచురల్ స్టార్ నానినే హీరో. ఈ సారి ఈ కాంబోలో రాబోయే ఈ ప్రాజెక్ట్ ప్యాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.
ఈ భారీ ప్యాన్ ఇండియా సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ పేరు పరిశీలిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. నిప్పు లేనిదే పొగ రాదు కదా. నిజమెంతో తెలీదు కానీ, ఈ కాంబినేషన్ వర్కవుట్ అయితే, సూపర్‌గా వుంటుంది.
శ్రీకాంత్ ఓదెల మంచి విషయమున్న డైరెక్టర్. ఈయన డైరెక్షన్లో ‘దసరా’ సినిమాలో కీర్తి సురేష్‌కి అప్పటి వరకూ వున్న క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి చేరుకుంది. అలాగే, జాన్వీ నటించినా ఖచ్చితంగా అది టాలీవుడ్లో ఆమె కెరీర్‌కి బెస్ట్ లెవల్లో యూజ్ అవుతుంది. చూడాలి మరి.
తాజా వార్తలు
- కూటమి పాలనలో ఎన్నో విజయాలు సాధించాం: మంత్రి పార్థసారధి
- తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయం పై సీఎం రేవంత్ ని అభినందించిన ఎంపీలు
- మంత్రి లోకేష్ అమెరికా పర్యటనలో భారీ పెట్టుబడులకు అవకాశం
- 10 లక్షల ఉద్యోగాలు భారతీయులకు ఇస్తాం: అమెజాన్
- ఉర్దూ అకాడమీ వారోత్సవాలు: మంత్రి ఫరూక్
- 13న హైదరాబాద్ లో లియోనెల్ మెస్సీ సందడి
- గోల్డ్ కార్డ్ వీసాను ప్రారంభించిన ట్రంప్
- వెదర్ అలెర్ట్..ఖతార్ లో భారీ వర్షాలు..!!
- SR324 మిలియన్లతో 2,191 మంది ఉద్యోగార్ధులకు మద్దతు..!!
- ఫోటోగ్రఫీ ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఒమన్..!!







