గల్ఫ్ వర్కర్స్ సంరక్షణపై దృష్టి సారించిన జిల్లా కలెక్టర్ నాగరాణి
- July 16, 2024
* రిజిస్టర్ ఏజెన్సీల ద్వారా మాత్రమే గల్ఫ్ కి వెళ్ళేలా చర్యలు
* ఉపాధి పొందేందుకు వెళ్లే మహిళలకు ప్రత్యేక శిక్షణకు కార్యాచరణ
* మహిళలు మోసపోకూడదన్న లక్ష్యంతో జిల్లా కలెక్టర్ ముందడుగు
భీమవరం: గల్ఫ్ వలస కారణంగా ఏ మహిళ మోసపోకూడదనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రత్యేక కార్యచరణతో రంగంలోకి దిగారు. గల్ఫ్ దేశానికి ఉపాధి కోసం వెళ్లి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళా వర్కర్ల ఆవేదనను ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా తెలుసుకున్న కలెక్టర్ నివారణ చర్యలపై దృష్టి సారించారు. ఆక్రమంలో మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ చాంబర్లో ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ప్రతినిధులు, సంబంధిత అధికారులతో గల్ఫ్ సురక్షిత వలసలపై సమీక్షించారు.
మహిళలు ఏజెన్సీల ద్వారా మోసపోకుండా, నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణతో పాటు సురక్షితమైన మార్గం ద్వారా గల్ఫ్ కు పంపేందుకు తగిన కార్యాచరణ అమలకు చర్యలు తీసుకోనున్నామని ఈ సందర్భంగా నాగరాణి వివరించారు.
ఉపాధి కోసం విదేశాలకు ఎలా వెళ్లాలి, ఇందుకు అవసరమైన ధ్రువపత్రాలు ఏం కావాలి, ఏజెన్సీ సురక్షితమైనదా కాదా, తొలుత ఎవరిని సంప్రదించాలి, శిక్షణ ఎలా పొందాలి తదితర విషయాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.
దీనిలో భాగంగా జిల్లా స్దాయిలో తొలుత "గల్ఫ్ వర్కర్స్ సహాయ కేంద్రం" ప్రారంభించనున్నట్లు వివరించారు. కేంద్ర నిర్వహణ విధి విధానాలపై డి ఆర్ డి ఏ, పోలీస్, ఐ సి డి ఎస్, కార్మిక శాఖల సిబ్బందితో టీమ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు ఆరవ తేదీన గుర్తింపు పొందిన, పొందని ఏజెన్సీలతో వర్క్ షాప్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.
తొలుత గల్ఫ్ కు వెళ్లే మహిళలను గుర్తించి, వర్క్ షాప్ నందు వారికి పూర్తి అవగాహన కలిగిస్తామన్నారు. అనంతరం వారికి వంటలో నిపుణత, భాష, బేబీ కేరింగ్, హౌస్ కీపింగ్ తదితర అంశాలపై పూర్తి శిక్షణను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
అయితే జిల్లాలో ఉపాధి మార్గాలు మెండుగా ఉన్నాయని మహిళలు వాటిని సద్విని చేసుకోవాలని నాగరాణి కోరారు. కుటుంబ సభ్యులకు దూరమై సుధూర ప్రాంతాలకు వెళ్లేవారు జిల్లాలో ఉపాధి మార్గాలను తెలుసుకోవాలన్నారు. జూమ్ ద్వారా పాల్గొన్న ఐఎల్ఓ ప్రతినిధి నెహ్వ అద్వానీ, ఇంటర్నేషనల్ నాన్ రెసిడెంట్స్ తెలుగు ఆర్గనైజేషన్ సీఈవో హేమ గల్ఫ్ కు వెళ్లే మహిళ వర్కర్ల భద్రత, సురక్షిత ప్రయాణం పై సూచనలు చేసారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. ఈ సమావేశంలో ఓవర్సీస్ మ్యాన్ పవర్ జిఎం బి.ఆర్ క్రాంతి కుమారి, హెచ్ ఆర్ మేనేజర్ బి.సతీష్ బాబు, డిఆర్డిఏ పిడి ఎమ్మెస్ఎస్ వేణుగోపాల్, జిల్లా కార్మిక శాఖ అధికారి ఆకన లక్ష్మి, ఐసిడిఎస్ పిడి బి.సుజాత రాణి, జిల్లా నైపుణ్య శిక్షణ అభివృద్ధి అధికారి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!
- ఖతార్లో నెలరోజుల్లో QR18.626 బిలియన్ల లావాదేవీలు..!!
- సౌదీ అరేబియాలో భూకంపం.. యూఏఈలో ప్రభావమెంతంటే?
- కువైట్ లో వేర్వేరు కేసుల్లో ఆరుగురి అరెస్ట్..!!
- రియాద్ ఎక్స్పో 2030.. కింగ్ హమద్ కు ఆహ్వానం..!!
- రోడ్డుపై ట్రక్కు బోల్తా..ప్రయాణికులకు అలెర్ట్..!!
- Insta TV యాప్ను విడుదల చేసిన మెటా







