ఒమన్ జీడీపీ తొలి త్రైమాసికంలో 1.7% వృద్ధి
- July 17, 2024
మస్కట్: 2024 మొదటి త్రైమాసికంలో సుల్తానేట్ ఆఫ్ ఒమన్ యొక్క స్థూల దేశీయోత్పత్తి (GDP) స్థిర ధరల వద్ద 1.7 శాతం పెరిగి (మార్కెట్ ధర ప్రకారం) OMR9,537.0 మిలియన్లకు చేరుకుంది. 2023లో ఇదే కాలంలో OMR9,373.9 మిలియన్లుగా ఉంది. ఈ మేరకు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) ప్రాథమిక డేటా నివేదికను విడుదల చేసింది.
ముడి పెట్రోలియం కార్యకలాపాలు OMR2,554.9 మిలియన్లు (3.3 శాతం తగ్గాయి), అదే సమయంలో సహజ వాయువు కార్యకలాపాలు 3 శాతం పెరిగి OMR437.1 మిలియన్లకు చేరుకున్నాయి. అంతేకాకుండా, 2023 మొదటి త్రైమాసికం చివరినాటికి OMR6,511.7 మిలియన్లతో పోలిస్తే, 2024 మొదటి త్రైమాసికం చివరినాటికి చమురుయేతర కార్యకలాపాలు 4.5 శాతం పెరిగి OMR6,803.3 మిలియన్లకు చేరాయి.
2023 మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి OMR1,881.7 మిలియన్లతో పోలిస్తే పారిశ్రామిక కార్యకలాపాలు OMR1,988.1 మిలియన్లుగా నమోదయ్యాయి.వ్యవసాయం, అటవీ మరియు చేపలు పట్టే కార్యకలాపాలు OMR219 మిలియన్లు మరియు సేవా కార్యకలాపాలు OMR4,596.2 మిలియన్లుగా నమోదయ్యాయి.
తాజా వార్తలు
- సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై కేంద్ర ప్రభుత్వం కొరడా
- చరిత్రలో నిలిచేలా TTD నిర్ణయాలు..!
- ANR కాలేజీకి నాగార్జున రూ.2 కోట్ల విరాళం
- కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ల పునర్నిర్మాణం: ఎంపీ బాలశౌరి
- ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ విడుదల
- కార్తీక్ శర్మ: ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు..
- రేపు నటుడు విజయ్ భారీ ర్యాలీ
- శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి
- హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
- వెస్ట్ బ్యాంక్ పై ఇజ్రాయెల్ తీరును ఖండించిన సౌదీ..!!







