దుబాయ్ లో 256 మంది ప్రాపర్టీ బ్రోకర్లకు జరిమానా

- July 18, 2024 , by Maagulf
దుబాయ్ లో 256 మంది ప్రాపర్టీ బ్రోకర్లకు జరిమానా

దుబాయ్: 2024 ప్రథమార్థంలో ప్రకటనల నిబంధనలు, షరతులను పాటించనందుకు 256 మంది ప్రాపర్టీ బ్రోకర్లకు జరిమానా విధించినట్లు దుబాయ్ ల్యాండ్ డిపార్ట్‌మెంట్(DLD) తెలిపింది. రెగ్యులేటర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో చట్టాలకు కట్టుబడినందుకు 1,200 కంటే ఎక్కువ చట్టపరమైన హెచ్చరికలు కూడా జారీ చేసినట్టు వెల్లడించింది. 2024 ప్రథమార్థంలో DLD ఇన్‌స్పెక్టర్లు 450 క్షేత్ర తనిఖీలతోసహా మొత్తం 1,530 తనిఖీలు నిర్వహించారని రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ ఏజెన్సీలోని రియల్ ఎస్టేట్ నియంత్రణ విభాగం డైరెక్టర్ అలీ అబ్దుల్లా అల్ అలీ తెలిపారు.   

“ఎమిరేట్‌లోని రియల్ ఎస్టేట్ రంగాన్ని నియంత్రించే నిబంధనలకు అన్ని పార్టీలు కట్టుబడి ఉండేలా పర్యవేక్షణ, తనిఖీ యంత్రాంగాలను అభివృద్ధి చేయడంపై మేము నిరంతరం కృషి చేస్తాము. మార్కెట్ స్థిరత్వం మరియు అభివృద్ధిని నిర్వహించడానికి DLD జారీ చేసిన సూచనలు, ఆదేశాలకు పూర్తిగా కట్టుబడి ఉండాలని మేము అన్ని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు మరియు కంపెనీలను కోరుతున్నాము. DLD ఆమోదించని ఎటువంటి ఆస్తి ప్రకటనలకు రెస్పాండ్ కావొద్దని పిలుపునిస్తున్నాము.”అని అల్ అలీ అన్నారు.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com