సినిమా రివ్యూ: ‘డార్లింగ్’
- July 19, 2024ప్రియదర్శి, నభా నటేష్ జంటగా అశ్విన్ రామ్ తెరకెక్కించిన చిత్రమే ‘డార్లింగ్’. సినిమాని బాగా ప్రమోట్ చేశారు. స్ల్పిట్ పర్సనాలిటీ వున్న భార్యతో ఓ భర్త జీవితం.. అనే కాన్సెప్ట్‌లో ఈ సినిమా వుండబోతోందని ఫస్ట్ గ్లింప్స్‌లోనే కథ మొత్తం చెప్పేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. మరి ప్రమోషన్స్‌లో చెప్పినట్లు, ప్రోమోస్‌లో చూపించినట్లు ఫన్ టోన్‌లో సినిమా వుందా.? కామెడీ ప్రేక్షకుల్ని ‘డార్లింగ్’ ఆకట్టుకుందా.? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
'మేక్ మై ట్రిప్' అనే ట్రావెల్ ఏజెన్సీలో ఉద్యోగిగా పని చేసే రాఘవ (ప్రియదర్శి)కి, అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని, హనీమూన్‌కి ప్యారిస్ వెళ్లాలని చిన్నప్పటి నుంచీ కోరిక. అలాగే తాను కోరుకున్నట్లే ఓ అందమైన అమ్మాయి (అనన్య నాగళ్ల)తో పెళ్లి ఫిక్స్ చేస్తాడు ప్రియదర్శి తండ్రి. లాస్ట్ మినిట్‌లో మూడు ముళ్లు వేస్తాడనగా ఆ అమ్మాయి తాను కోరుకున్న ప్రియుడితో లేచిపోతుంది. దాంతో డిప్రెషన్‌లోకి వెళ్లిన రాఘవ ఆత్మహత్యకు పాల్పడతాడు. ఈ క్రమంలో ఓ అమ్మాయి మాటలు తనను ప్రభావితం చేస్తాయ్. చావు నుంచి తప్పిస్తాయ్. దాంతో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అందుకు ఆ అమ్మాయి ఆనంది (నభా నటేష్) కూడా ఒప్పుకుంటుంది. సడెన్‌గా వాళ్ల పెళ్లయిపోతుంది. అయితే, ఫస్ట్ నైట్ రోజే భార్య అసలు స్వరూపం తెలుసుకున్న రాఘవ ఏం చేశాడు.? అసలు ఆనందిలో వున్న ఆ ఐదుగురు (ఆది, ఝాన్సీ, పాప, శ్రీశ్రీ, ఇంకొక వ్యక్తి) వ్యక్తులు ఎవరు.? తన భార్యకున్న స్ల్పిట్ పర్సనాలిటీ సమస్యతో రాఘవ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది.? చివరికి తాను అనుకున్న కోరిక తీర్చుకన్నాడా.? తెలియాలంటే ‘డార్లింగ్’ ధియేటర్లలో చూడాల్సిందే.
నటీనటుల పనితీరు:
ప్రియదర్శి ఏ క్యారెక్టర్ పోషించినా ఆ క్యారెక్టర్‌లో తనను తాను నిలదొక్కుకుంటాడు. ప్రేక్షకుడికి అంతలా కనెక్ట్ అయిపోతాడు. హీరో ఫ్రెండ్ రోల్ అయినా, కామెడీ రోల్ అయినా.. ఎక్కడ ఎలా తన పాత్రను ఎలివేట్ చేసుకోవాలో ప్రియదర్శికి బాగా తెలుసు. అందుకే జస్ట్ సపోర్టింగ్ రోల్స్ చేసినా, హీరోగా పూర్తి సినిమాలో కనిపించినా వన్ మ్యాన్ షో అవుతాడు. కానీ, ‘డార్లింగ్’ విషయానికొచ్చేసరికి తన వంతుగా తాను హండ్రెడ్ పర్సంట్ ఇచ్చాడు. కానీ, కథ మొత్తం హీరోయిన్ రోల్ చుట్టూ కీలకంగా తిరగడంతో ప్రియదర్శి ఎంత కష్టపడినా ఈ సినిమాని నిలబెట్టలేకపోయాడు. ఇక, ఇంపార్టెంట్ రోల్ అయిన నభా నటేష్ పాత్రను అసలు దర్శకుడు ఎలా డిజైన్ చేశాడో అర్ధం కాదు. ఫైనల్ అవుట్ చెక్ చేసుకోకుండానే నీకెలా వస్తే అలా నటించేయ్ అని చెప్పాడో ఏమో.. అస్సలు సూట్ కాకుండా.. అడ్డదిడ్డంగా విసుగు పుట్టించే పర్‌ఫామెన్స్ ఇచ్చింది నభా నటేష్. నిజానికి నభా నటేష్ మంచి నటే. తొలి సినిమాతోనే ఆ విషయం ప్రూవ్ చేసుకుంది. కానీ, గ్యాప్ తర్వాత ఏమైందో ఏమో.. ఆమె లుక్స్‌లోనూ డిఫరెన్స్ వచ్చేసింది. అలాగే పర్‌ఫామెన్స్‌లోనూ తేడా కొట్టేసింది. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు:
తమిళ దర్శకుడైన అశ్విన్ రామ్ స్ల్పిట్ పర్సనాలిటీ అన కాన్సెప్ట్‌ని ఎంచుకోవడం బాగుంది. కానీ, ఆ కాన్పెస్ట్‌ని తాను అనుకున్నట్లుగా కామెడీగా ప్రొజెక్ట్ చేసే విధానంలో హండ్రెడ్ పర్సంట్ ఫెయిలయ్యాడు. సినిమాకి ఎంతో కీలకమైన హీరోయిన్ పాత్రను సమర్ధవంతంగా తీర్చి దిద్దడంలోనే ఆయన మొదటి ఓటమి చవి చూశాడు. గతంలో ఈ తరహాలో వచ్చిన ‘అపరిచితుడు’ సినిమాలోని థ్రిల్‌నీ, తాను అనుకున్నట్లుగా కామెడీ రైడ్‌ని మిక్స్ చేసి.. అసలు ప్రేక్షకుడికి ఏమివ్వాలనుకున్నాడో మర్చిపోయాడు. దాంతో, అంతా కంగాళీ అయిపోయింది. ఎప్పుడయిపోతుందిరా సినిమా అనే అభిప్రాయం ప్రేక్షకుడికొచ్చేసింది. ఇక మంచి విషయమున్న సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ఆకట్టుకునే మ్యూజిక్ ఇవ్వలేకపోయాడు. ఏదో నామమాత్రంగా మ్యూజిక్ కొట్టేశాడంతే. నిర్మాణ విలువలు ఓకే, సినిమాటోగ్రఫీ కూడా ఓకే. సినిమాలోని విషయముంటే, టెక్నీషియన్లు కూడా అంతే విషయంతో పని చేస్తారు. ‘డార్లింగ్’లో విషయం లేదని ముందే తెలిసిపోయిన్నట్లుంది.. టెక్నికల్ వర్క్ అంతా సో సోగానే నడిచింది.
ప్లస్ పాయింట్స్:
ప్రియదర్శి పర్‌ఫామెన్స్, ఫస్టాప్‌లో కొన్ని కామెడీ సీన్లు, క్లైమాక్స్‌లో ప్రియదర్శి ఎమోషనల్ సీన్లు..
మైనస్ పాయింట్స్:
హీరోయిన్‌గా నభా నటేష్ ఎంపిక, అస్సలు సూట్ కాని ఆమె పర్‌ఫామెన్స్, బోరింగ్‌గా కంప్లీట్ ఫ్లాట్‌గా సాగిన సన్నివేశాలు, అన్ లాజికల్ కామెడీ టైమింగ్స్.. ఇంకా చాలా
చివరిగా:
నవ్వుకోవాలని వెళితే, నవ్వులు పాలవ్వాల్సిందే ‘డార్లింగ్’..!
తాజా వార్తలు
- మహిళా టీ20 ప్రపంచకప్..భారత్ పై న్యూజిలాండ్ విజయం
- నిజమాబాద్: ముగ్గురి ఉసురు తీసిన ఆన్ లైన్ బెట్టింగ్..
- సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్ ఇంట తీవ్ర విషాదం
- విద్యార్థుల నుంచి లంచం..టీచర్‌కు మూడేళ్ల జైలు, 5,000 దిర్హామ్‌ల జరిమానా..!!
- సౌదీయేతరులతోనే 64.8% సౌదీల వివాహాలు..అధ్యయనం వెల్లడి..!!
- షేక్ జాయెద్ రోడ్లో యాక్సిడెంట్.. 4.2 కి.మీ పొడవున ట్రాఫిక్ జామ్..!!
- దోహాలో రెండు కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత..!!
- కువైట్ లో తక్షణ చెల్లింపు కోసం 'WAMD' సర్వీస్ ప్రారంభం..!!
- మెట్రో రైడర్స్ కు గుడ్ న్యూస్.. ఈ-స్కూటర్లపై నిషేధం ఎత్తివేత..!!
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్