విమాన ప్రయాణీకులు ఇబ్బంది పడకుండా చూడండి: ఎవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడు
- July 19, 2024
శ్రీకాకుళం: మైక్రోసాఫ్ట్ లో టెక్నికల్ సమస్య కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో పడిగాపులు గాస్తున్నారు. ఇటు దేశ వ్యాప్తంగా కూడా పలు విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. ఈ సమస్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు… తన నియోజకవర్గమైన శ్రీకాకుళంలో పర్యటనలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ, మైక్రోసాఫ్ట్ లో వచ్చిన సమస్యతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిందన్నారు. అనుకోని సమస్యతో ఇబ్బంది వచ్చిందన్నారు.
విమానాశ్రయాల్లో వేచిచూస్తున్నవారికి ఫుడ్, మంచినీళ్లు అందించాలని.. అధికారులను ఆదేశించారు. ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అందరు సహనంతో ఉంటూ.. అధికారులకు సహకరించాలని కోరారు రామ్మోహన్ నాయుడు.
--సాగర్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇండెక్స్..8వ స్థానంలో ఒమన్..!!
- అమీర్ భారత్ పర్యటన విజయవంతం..!!
- సౌదీలో ముగ్గురు విదేశీయులు అరెస్ట్..!!
- శిథిల భవనాల కోసం అత్యవసర టాస్క్ఫోర్స్.. ఎంపీలు ఆమోదం..!!
- Dh1 స్కామ్: ఏఐతో వేలాది దిర్హామ్స్ కోల్పోయిన బాధితులు..!!
- అంతరాష్ట్ర ఎన్.డి.పి.ఎల్ సరఫరా చైన్ భగ్నం
- కువైట్ లో తీవ్రమైన పార్కింగ్ కొరత..అధ్యయనం..!!
- పామర్రు జనసేన పార్టీ శ్రేణులతో బండిరామకృష్ణ సమావేశం
- ప్రతి బింబాలు కథా సంపుటి ఆవిష్కరణ
- శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహోత్సవాలు ప్రారంభం