ఆఫ్ లైన్‌లో శ్రీవారి దర్శనం టికెట్ల కోటా 1000 మాత్రమే
- July 19, 2024
తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా, సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచే చర్యలు తీసుకుంటోంది. జూలై 22వ తేదీ నుండి శ్రీవాణి దర్శన టికెట్లను టీటీడీ రోజుకు 1,000కి పరిమితం చేసింది. ఇందులో భాగంగా ఇదివరకు ఉన్నట్లే ఆన్ లైన్ లో 500, ఆఫ్లైన్లో 1,000 టికెట్లను జారీ చేస్తారు. తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికగా జారీ చేస్తారు. శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లో 100 టికెట్లు అందుబాటులో ఉంచారు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో మాత్రమే ఆఫ్లైన్ టిక్కెట్లు జారీ చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించవలసిందిగా కోరింది.
తాజా వార్తలు
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!
- ఒమన్ లో స్కూల్ బస్సు డ్రైవర్లకు పోలీసుల కీలక సూచనలు..!!
- బహ్రెయిన్‌లో మత బోధన, కార్యకలాపాలకు కొత్త నిబంధనలు..!!
- ప్రపంచ సుందరిగా జొహైరీ మోలా..
- వాట్సాప్‌లో అదిరిపోయే AI ఫీచర్..!
- సౌదీలో వారం రోజుల్లో 12,363 మంది నివాసితులపై బహిష్కరణ వేటు..!!
- కింగ్ ఫహద్ కాజ్‌వేపై బహ్రెయిన్–సౌదీ ట్యాక్సీలకు అనుమతి..!!







